బెంగాల్‌ 6వ విడతలో  79% పోలింగ్‌

23 Apr, 2021 09:20 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి గురువారం 6వ విడత పోలింగ్‌ పూర్తయింది. 43 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ పోలింగ్‌లో సాయంత్రం 5 గంటలకు 79.09% పోలింగ్‌ నమోదైందని చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌(సీఈవో) ఆరిజ్‌ అఫ్తాబ్‌ తెలిపారు. కొన్ని హింసాత్మక ఘటనలు మినహా మొత్తమ్మీద పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లు మొరాయించిన ఘటనలు ఐదు దశలతో పోలిస్తే స్వల్పంగానే నమోదయ్యాయని చెప్పారు. ఆరో దశలో శాంతి భద్రతల కోసం ఈసీ 1,071 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగించింది. ఈ నెల 26, 29వ తేదీల్లో మరో రెండు విడతల్లో రాష్ట్రంలో పోలింగ్‌ జరగనుంది. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. 


పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 1071 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. పోలింగ్‌ కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ విడతలో నాలుగు జిల్లాల్లోని మొత్తం 43 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో 306 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
చదవండి: ఈ విపత్తు మోదీ వైఫల్యమే: మమత

మరిన్ని వార్తలు