లాక్‌డౌన్‌: స్వీట్లు కొనడానికి వెళ్తున్న సార్‌.. వీడియో వైరల్‌

18 May, 2021 09:13 IST|Sakshi

కోల్‌కతా: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కోరలు చాస్తోంది. నిత్యం లక్షల్లో కేసులు వెలుగు చూస్తున్నాయి. మహమ్మారి కట్టడి కోసం యావత్ దేశం మళ్లీ లాక్‌డౌన్‌లోకి వెళుతోంది. అన్ని రాష్ట్రాల్లో కఠినతరమైన ఆంక్షలు విధిస్తున్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని.. లాక్‌డౌన్ సమయంలో అనవసరంగా బయటకు వస్తే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కొందరు మాత్రం లాక్‌డౌన్‌ నిబంధనలను పట్టించుకోకుండా చిన్న కారణాలతో అనవసరంగా బయకు వస్తున్నారు. గత ఏడాది హైదరాబాద్‌లో ఓ వ్యక్తి గోధుమ పిండి కోసం బయటకు వచ్చానని చెప్పిన వీడియో అందరికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది.

తాజాగా పశ్చిమ బెంగాల్‌లోనూ ఓ వ్యక్తి అచ్చం ఇలాంటి కారణంతోనే పోలీసులకు చిక్కాడు. బెంగాల్‌ ప్రజలకు స్వీట్లు అంటే ప్రాణం. దీంతో లాక్‌డౌన్‌లోనూ అక్కడి ప్రభుత్వం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ స్వీట్ల దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి లాక్‌డౌన్‌లో స్వీట్లు కొనడానికి బయటకు వచ్చాడు. దీనికితోడు తన మెడలో ‘స్వీట్లు కొనడానికి వెళ్తున్నా’ అని రాసి ఉన్న బోర్డును  మెడకు తగిలించుకుని మరీ రోడ్డు మీద తిరుగుతున్నాడు. సదరు వ్యక్తిని గమనించిన పోలీసులు అతన్ని ఆపి రోడ్డు మీదకు ఎందుకు వచ్చావ్‌ అని సీరియస్‌గా అడిగారు. ఇందుకు అతను తన మెడలో బోర్డును చూపిస్తూ ‘స్వీట్లు కొనడానికి వెళ్తున్నా’ అని అక్కడి నుంచి పరారయ్యాడు. దీనికి సంబంధించిన వీడయోను ఓ వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

చదవండి:
Lockdown: మాస్కులు లేకుండా తిరిగిన వారినుంచి రూ. 31 కోట్లు

లాక్‌డౌన్‌: తెగ తిరుగుతున్నారు!

మరిన్ని వార్తలు