భారీ సంఖ్యలో అప్రెంటిస్‌ జాబ్స్‌.. రైల్వే నోటిఫికేషన్‌

13 Oct, 2021 14:53 IST|Sakshi

ఐటీఐ చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్‌న్యూస్‌. వివిధ డివిజన్లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు భారతీయ రైల్వే శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 2226 అప్రెంటిస్‌లు
జబల్‌పూర్‌ పధాన కేంద్రంగా ఉన్న వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే, రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ).. 2021–22 సంవత్సరానికి గాను వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం ఖాళీల సంఖ్య: 2226
► ట్రేడులు: డీజిల్‌ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెషినిస్ట్, టర్నర్, వైర్‌మెన్, కార్పెంటర్, పెయింటర్‌ తదితరాలు.
► అర్హత: 50శాతం మార్కులతో పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి.
► వయసు: 01.01.2022 నాటికి 15–24 ఏళ్ల మధ్య ఉండాలి.
► ఎంపిక విధానం: పదో తరగతి,ఐటీఐలో సాధించి న మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 10.11.2021
► వెబ్‌సైట్‌: https://wcr.indianrailways.gov.in

ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 2206 అప్రెంటిస్‌లు
పాట్నా ప్రధాన కేంద్రంగా ఉన్న ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే(ఈసీఆర్‌)కు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ).. వివిధ డివిజన్లలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► మొత్తం ఖాళీల సంఖ్య: 2206
► ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెకానిక్‌(డీజిల్‌), కార్పెంటర్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, పెయింటర్, వైర్‌మెన్‌ తదితరాలు.
► అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి.
► వయసు: 01.01.2021 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి.
► ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.11.2021
► వెబ్‌సైట్‌: https://ecr.indianrailways.gov.in

సౌత్‌ వెస్టర్న్‌ రైల్వే, హుబ్లిలో 904 అప్రెంటిస్‌లు
హుబ్లిలోని సౌత్‌ వెస్టర్న్‌ రైల్వే(ఎస్‌డబ్ల్యూఆర్‌).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం ఖాళీల సంఖ్య: 904
► డివిజన్ల వారీగా ఖాళీలు: హుబ్లి డివిజన్‌–237, క్యారేజ్‌ రిపెయిర్‌ వర్క్‌షాప్‌–217, బెంగళూరు డివిజన్‌–230, మైసూరు డివిజన్‌–177, సెంట్రల్‌ వర్క్‌షాప్, మైసూరు–43.
► అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి.
► వయసు: 03.11.2021 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి.
► ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 03.11.2021
► వెబ్‌సైట్‌: www.rrchubli.in

>
మరిన్ని వార్తలు