యుఏఎన్ నెంబర్‌-ఆధార్ లింక్ చేయకపోతే కలిగే నష్టాలు?

31 Aug, 2021 18:28 IST|Sakshi

ఈపీఎఫ్ ఖాతా యుఏఎన్ నెంబర్‌తో ఆధార్ ను లింక్ చేయడానికి చివరి తేదీ ఆగస్టు 31 అని పీఎఫ్ చందాదారులు గమనించాలి. మీరు మీ యుఏఎన్ నెంబర్‌తో ఆధార్‌ లింక్ చేయకపోతే అప్పుడు మీకు ఈపీఎఫ్ అందించే బహుళ ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది. ఇంతకు ముందు ఈ గడువు జూన్ 1 వరకు ఉండేది. కానీ, కరోనా మహమ్మారి నేపథ్యంలో గడువును ఆగస్టు 31, 2021 వరకు పొడిగించినట్లు ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఈపీఎఫ్ ఖాతా యుఏఎన్ నెంబర్‌తో ఆధార్ ను లింక్ చేయడం తప్పనిసరి చేసింది. దీని కోసం, ఈపీఎఫ్ఓ ​​సామాజిక భద్రత కోడ్ 2020 సెక్షన్ 142లో కొన్ని కీలక మార్పులు చేసింది.(చదవండి: పీఎఫ్ యూఎన్ నెంబర్‌తో ఆధార్‌ లింకు చేసుకోండి ఇలా..)

ఇక నుంచి పీఎఫ్ మెంబర్లు సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద ఏదైనా ప్రయోజనాన్ని పొందాలంటే ఆధార్ నంబర్-యుఏఎన్ లింకింగ్ తప్పనిసరి అని పేర్కొంది. రెండింటిని లింక్ చేయనివారికి పీఎఫ్ కంట్రిబ్యూషన్ అందకపోవడమే కాదు.. ఇతర ఈపీఎఫ్ఓ సేవలు ఆగిపోతాయని సంస్థ పేర్కొంది. పెన్షన్ ఫండ్‌ నుంచి డబ్బు తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఉద్యోగుల లింకింగ్ పూర్తయ్యే వరకు వాళ్ల ఖాతాలో కంపెనీలు తమ కంట్రిబ్యూషన్‌ను డిపాజిట్ చేయడం వీలుపడదు.(చదవండి: సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!)

ఈ ఏడాది జూన్‌ నుంచి ఆర్గనైజేషన్ ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్(ఈసీఆర్) దాఖలు చేసే రూల్స్ కూడా మారాయి. ఇక నుంచి ఆధార్‌తో లింక్ అయిన పీఎఫ్ ఖాతాకు మాత్రమే ఎలక్ట్రానిక్ చలాన్-కమ్ -రిటర్న్‌లను దాఖలు చేయడానికి యజమానులను అనుమతిస్తామని ఈపీఎఫ్‌ఓ ఇది వరకే ప్రకటించింది. పెన్షన్ ఫండ్‌కి అందించే డబ్బు కూడా అందులో పడదు. ఉద్యోగులు తమ వడ్డీని సైతం పొందలేరు. 

మరిన్ని వార్తలు