టీడీపీ నేత వర్ల రామయ్య తరపు లాయర్‌కి సుప్రీం ప్రశ్నల వర్షం

16 Nov, 2022 16:41 IST|Sakshi

న్యూఢిల్లీ: గత ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రజాధనం దుర్వినియోగంపై విచారణ చేస్తే తప్పేంటి? అని సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశ్నించారు. సిట్‌ నివేదిక వచ్చే వరకు ఆగలేరా​? అంటూ టీడీపీ నేత వర్ల రామయ్య తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు న్యాయవాది జస్టిస్‌ ఎంఆర్‌ షా ప్రశ్నించారు.

చంద్రబాబు హయాంలో కీలక విధాన నిర్ణయాలు, భారీ ప్రాజెక్టులలో జరిగిన అవకతవకలపై ఏపీ ప్రభుత్వం సిట్‌ విచారణకు ఆదేశించింది. అయితే సిట్‌ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించడాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్‌ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు.

ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. ఈకేసును సీబీఐకి అప్పగించాలని మేం కోరాం. దర్యాప్తు చేయొద్దని హైకోర్టు బ్లాంకెట్‌ ఆర్డర్‌ ఎలా ఇస్తుంది అని ప్రశ్నించారు. తదుపరి విచారణను రేపటి(గురువారం)కి వాయిదా వేశారు. 

చదవండి: (CM KCR: కేంద్రం టార్గెట్‌గా సీఎం కేసీఆర్‌ కొత్త వ్యూహం!)

మరిన్ని వార్తలు