వాట్సాప్‌ అడ్మిన్‌కు ఊరట.. బొంబాయి హైకోర్టు కీలక తీర్పు

27 Apr, 2021 16:20 IST|Sakshi

ముంబై: వాట్సాప్ గ్రూపు నిర్వాహకుల విషయంలో బొంబాయి హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వాట్సాప్ గ్రూప్ లోని సభ్యులు ఎవరైనా అభ్యంతరకరమైన, నేరపూరితమైన సమాచారం పంపితే అందుకు గ్రూప్ అడ్మిన్ జవాబుదారీ కాదని బొంబాయి హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. 33 ఏళ్ల వ్యక్తిపై లైంగిక వేధింపుల కేసుకు విషయంలో నమోదైన కేసును కొట్టివేస్తూ కోర్టు ఈ వాఖ్యలు చేసింది. వాట్సాప్ గ్రూపుల నిర్వాహకులకు దానిపై పరిమిత నియంత్రణ ఉందని కోర్టు పేర్కొంది. 

వాట్సాప్ గ్రూపు నిర్వాహకులు కేవలం కొత్త సభ్యులను జోడించవచ్చు లేదా తొలగించవచ్చు కానీ, గ్రూపులో పోస్ట్ చేసిన కంటెంట్‌ను నియంత్రించలేరు లేదా సెన్సార్ చేయలేరు అని తెలిపింది. అసలు విషయానికి వస్తే.. కిశోర్‌ తరోన్ పై 2016లో గోండియా జిల్లాలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తరోన్ నియంత్రణలో ఉన్న వాట్సాప్ గ్రూపు సభ్యుడిపై ఎటువంటి చర్యలు తీసుకోకాపోవడంలో విఫలమయ్యాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. 

ఓ గ్రూపులో కొందరు వ్యక్తులు మహిళా సభ్యులను అసభ్య పదజాలంతో దూషించినా ఆ గ్రూప్ అడ్మిన్ గా ఉన్న కిశోర్‌ తరోనే(33) స్పందించలేదని, ఆ సభ్యుడిని గ్రూప్ నుంచి తొలగించి లేదని కనీసం అతనిచే క్షమాపణ చెప్పించలేదు అని ప్రాసిక్యూషన్  వారు పేర్కొన్నారు. అతనిపై ఐపీసీ 354, 509, 107 సెక్షన్ల కింద, ఐటీ చట్టం 67వ నిబంధన కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ గ్రూప్ అడ్మిన్‌ హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఈ వాఖ్యలు చేసింది. గ్రూపులో ఎవరైనా అభ్యంతరకర పోస్టులు చేస్తే అతను మాత్రమే చట్టపరమైన చర్యలకు ఎలా బాధ్యుడు అవుతాడని కోర్టు స్పష్టం చేసింది.

చదవండి: 

వాట్సాప్ స్టేటస్ వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

మరిన్ని వార్తలు