వాట్సప్ యూజర్స్ బీ అలర్ట్

8 Mar, 2021 20:44 IST|Sakshi

వాట్సాప్ మరో కొత్త నిబంధన తీసుకోని రాబోతుంది. ఈ నిబంధన ప్రకారం కొన్ని పాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో వాట్సప్ నిలిచిపోనున్నట్లు తెలుస్తుంది. కొన్ని ఆపిల్ ఐఫోన్లపై దీని ప్రభావం పడనుంది. ఆపిల్ పాత ఐఓఎస్ 9 ఆపరేటింగ్ సిస్టమ్స్‌లతో కూడిన ఐఫోన్లలో వాట్సాప్ ఇకమీదట పనిచేయదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఆండ్రాయిడ్ 4.0.3 కన్నా పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లతో కూడిన స్మార్ట్ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు. వాట్సప్ తీసుకున్న తాజా నిర్ణయంతో లైనక్స్ కేఈఐఓఎస్ 2.5.1 ఆపరేటింగ్ సిస్టమ్స్‌ కన్న పాత ఫోన్లలో ఇది పని చేయదు. అయితే, ఈ సమస్య నుంచి బయటపడటానికి తప్పనిసరిగా యూజర్లు మీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసుకోవడం ఉత్తమం. ఆపిల్ ఐఫోన్‌లో సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. 

చదవండి:

రూ.1.97లక్షల కోట్ల ఎలాన్ మస్క్ సంపద ఆవిరి

ప్రపంచ తొలి 18జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్ విడుదల!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు