‘కోవిడ్‌కు సంబంధించి ఆ వార్తల్లో నిజం లేదు’

6 Apr, 2021 17:55 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతదేశంలో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ రూపంలో వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దీంతో అకస్మాత్తుగా కేసులు పెరగడంతో పాటు అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ వంటి చర్యలు చేపడుతున్నాయి. కరోనాకు సంబంధించి ప్రజల మనస్సులలో భయాందోళనలను సృష్టించే లక్ష్యంతో వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నకిలీ సందేశాలు కూడా వైరల్ అవుతున్నాయి.

ఇదే తరహాలో కరోనావైరస్ కారణంగా ఏప్రిల్ 15 నాటికి భారతదేశంలో 50,000 మంది చనిపోతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసిందని పేర్కొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే కరోనా కారణంగా  ఏప్రిల్‌ 15 లోపు ఇండియాలో 50 వేల మంది చనిపోతారని వార్తల్లో  నిజం లేదని డబ్యూహెచ్‌వో  స్పష్టం చేసింది. తాము ఎలాంటి హెచ్చరికలు చేయలేదని చెప్పింది. డబ్ల్యూహెచ్‌వో పేరిట వైర్‌ల్‌ అవుతున్న ఓ వీడియో ఫేక్‌ న్యూస్‌ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయం ట్వీట్‌ చేసింది.

 ( చదవండి: ఆస్ట్రాజెనెకా టీకా: రక్తం గడ్డకట్టి ఏడుగురు మృతి )

మరిన్ని వార్తలు