అస్సాంలో కరోనా మృతులు తక్కువెందుకు?!

9 Sep, 2020 17:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అస్సాంలోని సిల్చార్‌ నగరానికి చెందిన వ్యాపారవేత్త నారాయణ్‌ మిత్ర గత కొంతకాలం నుంచి అస్తమాతో బాధ పడుతున్నారు. ఆయనకు జూలై 13వ తేదీ రాత్రి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. ఆయన ఈ విషయాన్ని తన కుమారుడు అభిజిత్‌ మిత్రాకు తెలిపారు. కుమారుడు ఇచ్చిన ఇన్‌హేలర్‌తో కాస్త ఊరట కలిగింది. ఆ మరుసటి రోజు అభిజిత్‌ మిత్రా, కుటుంబ వైద్యుడికి ఫోన్‌చేసి తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు. ఆయన్ని ఆస్పత్రికి తరలించి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించాల్సిందిగా ఆ కుటుంబ వైద్యుడు సలహా ఇచ్చారు. (80 శాతం దాటిన రికవరీ)

అనారోగ్యంతో బాధ పడుతున్న తన తండ్రిని అభిజిత్‌ మిత్ర తీసుకొని జూలై 15వ తేదీన ఉదయం సిల్చార్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్‌ అనుమతి ఇస్తేనే తాము కరోనా పరీక్షల కోసం శాంపిల్స్‌ తీసుకుంటామని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. తండ్రీ కొడుకులు డాక్టర్‌ కోసం నిరీక్షించసాగారు. ఆస్పత్రి డాక్టర్‌ వచ్చి ఆయన అనుమతిచ్చే సరికి సాయంత్రం అయింది. కోవిడ్‌ పరీక్షల అనంతరం నారాయణ మిత్రకు మళ్లీ ఊపరాడని పరిస్థితి ఏర్పడడంతో ఆయన్ని ఎమర్జెన్సీ వార్డుకు తరలించి వెంటిలేటర్‌ అమర్చారు. ఆ మరుసటి రోజు, అంటే జూలై 16వ తేదీ ఉదయం నారాయణ మిత్ర మరణించారు. అదే రోజు సాయంత్రం ఆస్పత్రి వర్గాలు కోవిడ్‌ పరీక్షల ఫలితాలను ప్రకటింది. అందులో నారాయణ మిత్రకు కరోనా సోకినట్లు రుజువైంది. (కరోనా విలయం.. 43 లక్షలు దాటిన కేసులు)

ఆ తర్వాత కోవిడ్‌ మరణాలకు సంబంధించి ప్రభుత్వ ఆరోగ్య శాఖ విడుదల చేసిన జాబితాల్లో ఎక్కడా నారాయణ్‌ మిత్ర పేరు కనిపించలేదు. కోవిడ్‌ కారణంగా అస్సాంలో ఇప్పటి వరకు 370 మంది మరణించారటూ ప్రభుత్వ ఆరోగ్య శాఖ సెప్టెంబర్‌ ఏడవ తేదీన విడుదల చేసిన జాబితాలో కూడా ఆయన పేరు లేదు. ఆరోజు నాటికి అస్సాంలో 1,30,000 కరోనా కేసులు నమోదుకాగా, వారిలో మతుల సంఖ్య 0.28 శాతంగా ఉందంటూ పేర్కొన్నారు. కరోనా బారిన పడిన రోగుల సంఖ్యను, ఆ కారణంగా మరణించిన వారి సంఖ్యను మిగతా రాష్ట్రాలకన్నా తక్కువ చేసి చూపించినట్లు స్పస్టం అవుతోంది. 

నారాయణ మిత్ర మతి గురించి మీడియా జిల్లా అధికారుల దష్టికి తీసుకెళ్లగా ఆయనకున్న పాత జబ్బులతో పోయినట్లు వారు పేర్కొన్నారు. కరోనాతో మరణించినట్లు వారు అంగీకరించలేదు. కరోనా రోగులకు ఇతర తీవ్రమైన జబ్బులు ఉన్నట్లయితే కరోనాతో కాకుండా ఇతర జబ్బులతోనే వారు మరణించినట్లు ప్రభుత్వ వైద్యులు ధ్రువీకరిస్తున్నట్లు తెల్సింది. భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) మార్గదర్శకాల ప్రకారం కరోనా మతులను నిర్ధారించేందుకు నలుగురు సభ్యులతో ఓ ఆడిట్‌ బోర్డును ఏర్పాటు చేస్తున్నామని అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వా శర్మ జూలై 11వ తేదీన ప్రకటించారు. ఆ తర్వాత ఏర్పాటు చేశారు కూడా. 

కరోనా మరణాల ధ్రువీకరణకు ఆడిట్‌ బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రాలకు ఐసీఎంఆర్‌ ఎలాంటి ఆదేశాలనుగానీ, మార్గదర్శకాలనుగానీ సూచించలేదు. అయినప్పటికీ ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు ‘డెత్‌ ఆడిట్‌ బోర్డు’లను ఏర్పాటు చేశాయి. కరోనా మతుల లెక్క కచ్చితంగా తేలాలనే సదుద్దేశంతో ఆ రాష్ట్రాలు ఈ బోర్డులను ఏర్పాటు చేశాయి. బోర్డుల ఏర్పాటు తర్వాతే ఆయా రాష్ట్రాల్లో కరోనా మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. అస్సాంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుందని ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. కరోనా లక్షణాలతో ఆస్పత్రికి తీసుకొచ్చిన రోగులు కరోనా పరీక్షలకు ముందే మరణించినట్లయితే వారి మరణాలను కూడా ఆడిట్‌ బ్యూరోకు సిఫార్సు చేయడం లేదు. అస్సాంలో కరోనా మతులు ప్రభుత్వం అధికారికంగా చూపించిన కరోనా మతుల సంఖ్య కన్నా 250 శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వైద్య వర్గాలే తెలియజేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు