హథ్రాస్‌ కేసు.. డీఐజీ భార్య ఆత్మహత్య

24 Oct, 2020 21:11 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న చంద్ర ప్రకాష్‌ భార్య పుష్ప ప్రకాష్‌(ఫైల్‌ ఫోటో)

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. హథ్రాస్‌ కేసును దర్యాప్తు చేస్తోన్న సిట్‌ డీజీపీ భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్‌ కేసు దర్యాప్తుకు గాను యూపీ ప్రభుత్వం సిట్‌ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ చంద్ర ప్రకాష్‌ సిట్‌ సభ్యుల్లో ఒకరు. ఆయన భార్య పుష్ప ప్రకాష్‌(36) శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో లక్నోలోని వారి నివాసంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను లోహియా ఆస్పత్రికి తరలించారు. పుష్ప ప్రకాష్‌ని పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించిందని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (చదవండి: హథ్రాస్‌ ఆగ్రహం.. 50 కుటుంబాలు మత మార్పిడి)

ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని ఈస్ట్‌ జోన్‌ డీసీపీ చారు నిగమ్‌ తెలిపారు. 2005 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన చంద్ర ప్రకాష్‌‌ ప్రస్తుతం హథ్రాస్‌ కేసు దర్యాప్తు కోసం నియమించిన సిట్‌లో సభ్యుడిగా ఉన్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు