భర్త ఆదాయం తెల్సుకునే హక్కు భార్యకుంది

19 Nov, 2020 10:25 IST|Sakshi

సమాచార హక్కు చట్టం ప్రకారం భర్త ఆదాయాన్ని తెల్సుకునే హక్కు భార్యకు ఉంది

కేంద్ర సమాచార కమిషన్‌ స్పష్టీకరణ

జోధ్‌పూర్‌: సమాచార హక్కు చట్టం ప్రకారం భర్త ఆదాయాన్ని తెల్సుకునే హక్కు భార్యకు ఉందని కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) ప్రకటించింది. తన భర్త ఆదాయ వివరాలను తెలియజేయాలని జోధ్‌పూర్‌కి చెందిన రెహ్మత్‌ బాను ఆదాయపన్ను శాఖను కోరగా, వారు సమాచారమివ్వడానికి తిరస్కరించారు. దీంతో ఆమె సీఐసీకి అప్పీల్‌ చేసుకోగా, పిటిషన్‌ను విచారించిన కేంద్ర సమాచార కమిషన్, జోథ్‌పూర్‌ ఆదాయపన్ను శాఖకు 15 రోజుల్లోపు రెహ్మత్‌ కోరిన సమాచారమివ్వాలని ఆదేశించింది. మూడో వ్యక్తి ఆదాయ సమాచార వివరాలు ఇవ్వడం కుదరదని, ఇది సమాచార హక్కు నిర్వచన పరిధిలోకి రాదని, ఆదాయ పన్ను శాఖ వాదనను సీఐసీ తిరస్కరించింది. ‘ఇది వ్యక్తిగత సమాచారమని, దీన్ని వెల్లడించడం కుదరదు’అని ఆమె భర్త తిరస్కరించిన నేపథ్యంలో ఈ తీర్పు వెలువడిందని ఆమె న్యాయవాది రజక్‌ హైదర్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు