క్షణికావేశంలో తప్పు చేసిన భార్య.. కాపురం బుగ్గిపాలు

29 Apr, 2022 13:25 IST|Sakshi

దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలు సహజం. గొడవలున్నా సర్దుకుపోయి జీవించాలని పెద్దలు చెబుతుంటారు. కాగా, క్షణికావేశంలో భార్య చేసిన చిన్న తప్పు వివాహ బంధాన్ని నాశనం చేసింది. ఆమెను జీవితాంతం బాధపడేలా చేసి.. చివరకు విడాకులకు దారి తీసింది. 

వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు చెందిన దంపతులు పదేళ్లకుపైగా విదేశంలో నివసిస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్‌ కారణంగా వారు నివసిస్తున్న దేశంలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో వారు తిరిగి స్వదేశానికి రావాల్సి వచ్చింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా, వారు విదేశాల్లోనే చదువుతున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత భర్త.. ఓ వ్యాపారం ప్రారంభించగా.. భార్య ఓ కాలేజీలో ఉద్యోగం చేస్తోంది. అయితే, వారు భోపాల్‌కు రావడం భార్యకు ఎంతమాత్రం ఇష్టం లేకపోవడంతో భర్తతో ఆమె తరచూ గొడవపడేది. 

ఈ క్రమంలోనే వీరిద్దరూ గొడవ పడుతుండగా ఆవేశంతో రగిలిపోయిన భార్య.. భర్తను చెప్పుతో కొట్టింది. దీంతో ఒక్కసారిగా షాకైన భర్త.. తేరుకొని దీన్ని అవమానంగా ఫీలయ్యాడు. అనంతరం ఆమెతో విడిపోయేందుకు సిద్ధపడి విడాకులకు దరఖాస్తు చేశాడు. కానీ, కుటుంబ సభ్యులు మాత్రం వీరిద్దరికీ కౌన్సిలింగ్‌ ఇప్పించడానికి ప్రయత్నించారు. కౌన్సిలింగ్​ సమయంలో భార్య తన తప్పును ఒప్పుకుంది. భర్త మాత్రం జరిగిన ఘటనను అవమానంగా భావించి.. ఆమెతో జీవించలేనని తెగెసిచెప్పాడు. విడాకులు కావాలని పట్టుబట్టాడు. అనంతరం భర్తను భార్య ఎంత బ్రతిమిలాడిన అతను మససు మాత్రం మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో చేసేదేమీలేక కోర్టు వారికి విడాకులు మంజూరుచేసింది. 

ఇది కూడా చదవండి: వివాహమైన మూడు నెలలకే దారుణం

మరిన్ని వార్తలు