ఈ జంట మరీ వైల్డ్‌! పూల దండలుగా

4 Jun, 2022 14:19 IST|Sakshi

అబ్బాయి మెడలో చిన్న పాము, అమ్మాయి మెడలో పైథాన్‌... పై ఫొటో సాహస స్టంట్‌ను తలపిస్తోంది కదా! కానీ అక్కడ పెళ్లి జరుగుతోంది. పెళ్లికి ఎవరైనా పూల దండలు వేసుకుంటారు. మరీ పైసలెక్కువైతే నోట్ల దండలేసుకుంటా రు. కానీ వీళ్లేంటి మరీ ఇంత వైల్డ్‌గా ఉన్నారనుకుంటున్నారా? వాళ్లిద్దరూ మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాకు చెందిన వైల్డ్‌ లైఫ్‌ ఆఫీసర్స్‌ సిద్ధార్థ్‌ సోనావానే, సృష్టి ఔసర్మాల్‌. 2010 నవంబర్‌ 12న వాళ్ల పెళ్లి జరిగింది.

అసలే వన్యప్రాణి సంరక్షణ అధికారులు. పూలదండలు మార్చుకుంటే ఏం బాగుంటుంది? అనుకున్నారేమో. పాములనే దండలుగా మార్చుకున్నారు. వధువు సృష్టి ఔసర్మాల్‌ వరుడికి ఓ చిన్నపామును మెడలో వేస్తే... ‘నేనేం తక్కువ’ అంటూ వరుడు ఏకంగా పైథాన్‌నే వధువు మెడలో వేశాడు. ఆ తరువాత వాటిని అడవిలో వదిలేశారనుకోండి. అయితే ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది... కానీ ఆ పాములు కాస్త వైల్డ్‌గా రియాక్ట్‌ అయి ఉంటే? ఏమయ్యేది అని నెటిజన్స్‌ వాపోతున్నారు.

(చదవండి: నన్నే పెళ్లాడతా.. యువతికి షాక్‌!.. అడ్డుకుని తీరతామంటూ..)

మరిన్ని వార్తలు