అమిత్‌ షా నోట తెలంగాణ అధికారం.. ఆసక్తికర వ్యాఖ్యలు

26 Nov, 2022 14:15 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని గంటాపథంగా చెప్పారు. 

ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న అమిత్‌ షా.. తెలంగాణ రాజకీయంపై స్పందించారు.  ‘‘తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

తాను తెలంగాణకు వెళ్తానని ఆయన అన్నారు. అక్కడ ప్రజల పల్స్‌ తనకు తెలుసన్న షా.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. తప్పనిసరిగా మార్పు వస్తుందని అన్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో అధికార కైవసం కోసం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు