కేంద్రం కాదంటే..మేమే ఉచితంగా ఇస్తాం : ఢిల్లీ సీఎం

13 Jan, 2021 14:42 IST|Sakshi

దేశ ప్రజలకు ఉచితంగా టీకా సరఫరా చేయాలి : అరవింద్‌ కేజ్రీవాల్‌

ఢిల్లీ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్‌  

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌  కేజ్రీవాల్‌   తనరాష్ట్రప్రజలకు తీపి కబురుఅందించారు. కేంద్రం ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌ ను ఉచితంగా  అందించని పక్షంలో తమ ప్రభుత్వం ఢిల్లీ వాసులకు ఉచితంగా అందిస్తుందని బుధవారం వెల్లడించారు.  ఢిల్లీ ప్రజలకు ఉచిత టీకా సరఫరా చేస్తానని ఇప్పటికే  ప్రకటించిన ఆయన  మరోసారి ఇదే విషయాన్ని ధృవీకరించారు.  

కోవిడ్-19 విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ హితేష్ గుప్తా కుటుంబాన్ని పరామర్శించిన కేజ్రీవాల్‌ వ్యాక్సిన్ గురించి ఎవ్వరూ తప్పుగా ప్రచారం చేయవద్దని కోరారు. కరోనా టీకాను అందరికీ ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానని,  కేంద్రం దీనికి అంగీకరించకపోతే ఢిల్లీ ప్రజలకు తామే ఉచిత టీకా సౌకర్యాన్నిఅందిస్తామని ప్రకటించారు.   దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకాను సరఫరా చేయాలని  గతంలోఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.  కోవిడ్​-19 వ్యాక్సిన్​ను దేశ ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలనిగతంలో ట్విటర్‌ వేదికగా  డిమాండ్‌ చేశారు. టీకా  ప్రతి ఒక్కరి హక్కు అని ఆయన పేర్కొన్నారు.  కాగా   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా  ప్రపంచంలోనే అతిపెద్ద   వ్యాక్సినేషన్‌ డ్రైవ్  ఈ నెల(జనవరి) 16 న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు