Coronavirus: టీకాకు భయపడి డ్రమ్‌ వెనుక దాక్కున్న మహిళ

3 Jun, 2021 14:55 IST|Sakshi

లక్నో: కోవిడ్‌ వ్యాక్సిన్‌ బృందాన్ని చూసిన ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ టీకాకు భమపడి డ్రమ్‌ వెనుక దాక్కుంది. టీకాపై అవగాహన కల్పించేందుకు బీజేపీ ఎమ్మెల్యే సరితా భదౌరియా ఆరోగ్య శాఖ బృందంతో కలిసి మంగళవారం చందన్‌పూర్‌ గ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలో హరిదేవి(80) అనే ఓ మహిళ టీకా వేసే బృందాన్ని చూసి మొదట తలుపు వెను దాక్కుంది. ఆ తరువాత ఇంట్లో ఉండే ఓ పెద్ద డ్రమ్‌ వెనక్కి పరుగెత్తింది. దీంతో "నేను డాక్టర్‌ని. మీకు ఇంజెక్షన్ ఇవ్వడానికి నేను ఇక్కడికి రాలేదు. మీతో మాట్లాడటానికి మాత్రమే ఇక్కడ ఆగాం. కనీసం వచ్చి మీ ఎమ్మెల్యే చెప్పేది వినండి" అంటూ కోరారు. చివరకు ఆ మహిళ ఎమ్మెల్యేని కలిసినా..వ్యాక్సిన్‌ వేయించుకోలేదు.

ఇప్పటివరకు ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి 1.18 కోట్ల వ్యాక్సిన్‌లు కేంద్ర ప్రభుత్వం నుంచి అందినట్టు సమాచారం. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 2శాతం మాత్రమే టీకాలు తీసుకున్నారు. 23 కోట‍్ల జనాభా ఉన్న యూపీలో ఇప్పటి వరకు 35 లక్షల మందికి మాత్రమే టీకాలను వేశారు. ఇక వ్యాక్సిన్‌లపై ఉండే అపోహలతో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొందరు ప్రజలు టీకాలు వేయించుకోవడానికి భయపడుతున్న విషయం తెలిసిందే.

(చదవండి: ఎల్లలు దాటిన ఇండో-జర్మన్‌ ప్రేమ కథ )

>
మరిన్ని వార్తలు