సిగ్నల్‌ జంప్: ఏయ్‌ నన్నే ఆపుతావా? 

8 Mar, 2021 10:30 IST|Sakshi
ఏఎస్‌ఐతో గొడవకు దిగిన మహిళ

బెంగళూరు: సిగ్నల్‌ జంప్‌ చేసినందుకు జరిమానా కట్టాలన్న ట్రాఫిక్‌ ఏఎస్‌ఐపై మహిళ ఆగ్రహంతో మండిపడింది. శనివారం మధ్యాహ్నం ఉప్పారపేటే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మైసూరు బ్యాంక్‌ సర్కిల్‌ వద్ద ఏఎస్‌ఐ బసవయ్య డ్యూటీలో ఉండగా, యూపీకి చెందిన అపూరి్వడియాస్‌ అనే మహిళ కారులో వెళ్తూ సిగ్నల్‌ను అతిక్రమించింది. దీంతో ఏఎస్‌ఐ ఆ కారును అడ్డుకుని జరిమానా చెల్లించాలని తెలిపాడు. దీంతో కోపోద్రిక్తురాలైన మహిళ కారు దిగి ఏఎస్‌ఐ మెడ పట్టుకుని దౌర్జన్యం చేసింది. తిట్ల పురాణం అందుకుంది. ఆమెపై ఏఎస్‌ఐ ఉప్పారపేటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కసు నమోదు చేశారు.

చదవండి: ఉద్యమ స్ఫూర్తితో ముందడుగు

మరిన్ని వార్తలు