ఈవ్‌ టీజింగ్‌ను ప్రతిఘటించిన మహిళ.. బ్లేడుతో దాడి.. 118 కుట్లు

13 Jun, 2022 08:37 IST|Sakshi

భోపాల్‌: ఈవ్‌ టీజింగ్‌ను ప్రతిఘటించిన మహిళపై ముగ్గురు బ్లేడుతో విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. ముఖమంతా రక్తమోడుతున్న ఆమెకు ఆస్పత్రిలో 118 కుట్లువేసి చికిత్స చేశారు. భోపాల్‌లో జూన్‌ 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రాత్రిపూట భర్తతో కలిసి బైక్‌ మీద ఇంటికొస్తున్న మహిళపట్ల ఇద్దరుబాలురు, ఒక వ్యక్తి ఈవ్‌టీజింగ్‌కు పాల్పడ్డారు.

ప్రతిఘటించిన ఆమె ముఖంపై 10 సెంటీమీటర్ల మేర లోతైన గాటు పెట్టి బ్లేడుతో పలుచోట్ల దాడిచేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్‌చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం శివరాజ్‌ ఆదేశించారు. బాధితురాలిని సీఎం పరామర్శించి లక్ష ఆర్థికసాయం ప్రకటించారు. మున్సిపల్‌ అధికారులు ఒక నిందితుని ఇంటిని కూల్చివేశారు.  

మరిన్ని వార్తలు