Vaccine: టీకా వేసుకున్నాను.. కంటిచూపు తిరిగొచ్చింది!

5 Jul, 2021 13:54 IST|Sakshi
మథురాబాయి బిడ్వే(ఫొటో కర్టెసీ: జీన్యూస్‌)

ముంబై: ఇప్పటికీ చాలా మంది కోవిడ్‌ నివారణ వ్యాక్సిన్‌ వేసేందుకు జంకుతూనే ఉన్నారు. టీకా వేసుకుంటే కొత్త ఇబ్బందులు ఎదురవుతాయేమోనన్న భయాలతో వెనుకడుగు వేస్తున్నారు. అపోహల కారణంగా వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్నారు. కానీ మహారాష్ట్రలోని భీవండికి చెందిన మథురాబాయి బిడ్వే(70) అనే వృద్ధురాలు మాత్రం ఇందుకు అతీతం. వ్యాక్సిన్ చేయించుకోవాలని చెప్పగానే ధైర్యంగా ముందుకు వచ్చారు. జూన్‌ 26న కోవిషీల్డ్‌ ఫస్ట్‌డోస్‌ వేయించుకున్నారు. 

అయితే, టీకా వేసుకున్న తర్వాత జ్వరం రావడం, ఒళ్లు నొప్పులు, స్వల్ప అస్వస్థతకు గురౌవుతున్నామని కొంతమంది చెబుతుంటే.. మథురాబాయి మాత్రం వ్యాక్సిన్‌ తనకు ఎంతగానో మేలు చేసిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా... ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె... గత రెండేళ్లుగా తనకు కంటిచూపు పోయిందని, అప్పటి నుంచి అంధకారంలోనే బతుకుతున్నానన్నారు. అయితే, టీకా వేసుకున్న మరుసటి రోజు నుంచి మసకగానైనా వస్తువులు చూడగలుగుతున్నానని, 30- 40 శాతం కంటిచూపు తిరిగి వచ్చిందని పేర్కొన్నారు. కాగా, టీకాకు, కంటిచూపునకు ఏమైనా సంబంధం ఉన్నా విషయాలపై మాత్రం ఎటువంటి స్పష్టత లేదు.

>
మరిన్ని వార్తలు