పురుషుడిగా మారేందుకు మహిళా కానిస్టేబుల్​కు అనుమతి

1 Dec, 2021 20:55 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మహిళా కానిస్టేబుల్​కు తీపి కబురు అందించింది. మహిళ విన్నపం మేరకు.. లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఆమెకు ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో చికిత్స జరుగుతుందని తెలిపారు. ఆమెకు.. చిన్న తనం నుంచి పురుషులలో ఉన్నట్లు కొన్ని లక్షణాలు, హర్మోన్‌లు ఉన్నట్లు ఆమె గుర్తించింది.

 దీంతో ఆమె.. 2019లో లింగమార్పిడి శస్త్ర చికిత్సకోసం​ దరఖాస్తు చేసుకున్నారు. కాగా, గ్వాలియర్‌, ఢిల్లీలోని వైద్యుల సూచనమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కానిస్టేబుల్ తెలిపారు. దీనిపై మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా స్పందించారు.‘లింగమార్పిడి అనేది వ్యక్తి హక్కు..’ అని అన్నారు. అందుకే మహిళా కానిస్టేబుల్‌కు  అనుమతి తెలుపుతూ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సర్జరీకి ఆమె కుటుంబంవారు అంగీకరించలేదని తెలుస్తోంది. కానీ.. మహిళా లింగ మార్పిడి చేసుకోవడానికి మొగ్గుచూపుతుంది. దీనికోసం​  తాను.. దాచుకున్న డబ్బులతో సర్జరీ చేయించుకోవడానికి సిద్ధపడినట్లు కానిస్టెబుల్‌ తెలిపారు. కాగా,  2018లో మహరాష్ట్రకు చెందిన లలితా సాల్వె అనే మహిళా కానిస్టేబుల్ కూడా ఇదేవిధంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆమెకు సెయింట్‌ జార్జ్‌ ఆస్పత్రి వైద్యులు లింగమార్పిడి చికిత్సను నిర్వహించారు.

మరిన్ని వార్తలు