వైరల్‌: టీకా భయంతో చిన్న పిల్లలా ఏడ్చిన మహిళ!

12 Jul, 2021 14:02 IST|Sakshi

కరోనా బారి నుంచి రక్షణ పొందడానికి వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గం. ప్రస్తుతం భారతదేశం అంతటా కోవిడ్ -19 టీకా డ్రైవ్  కొనసాగుతోంది. వ్యాక్సినేషన్‌ ప్రాముఖ్యత తెలుపుతూ ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయినప్పటికి కొంతమంది వ్యాక్సిన్‌ తీసుకోవటానికి చాలా భయపడుతున్నారు. ఇందులో కొంతమంది సూది భయం (ట్రిపనోఫోబియా)తో కూడా వ్యాక్సిన్‌ వేసుకోవడం లేదు. చిన్నపిల్లలు ఇంజెక్షన్‌ తీసుకునేటప్పుడు ఏడవడం, అరవడం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ, ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా జరిగింది. ఒక మహిళ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు చిన్న పిల్లలా ఏడుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఒక మహిళ  కూర్చుని కనిపిస్తుంది. ఆమెకు వ్యాక్సిన్‌ ఇచ్చిన వెంటనే  చాలా బాధలో ఉన్నట్లుగా చిన్న పిల్లలా బిగ్గరగా ఏడుస్తూ ఉంటుంది. ఆమె ఇలా ఏడవటం చూసి, టీకా తీసుకునే మిగతా వారు కూడా భయపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు పలురకాల కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది చిన్నారిలా ఏడుస్తూ, భయపడినందుకు మహిళని ఎగతాళి చేశారు. మరికొందరు ఆమెకు అంత నొప్పి ఎలా పుట్టిందని కామెంట్‌ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఇటువంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియోలో వైరలైన సంగతి తెలిసిందే.

A post shared by 𝘁𝘂𝗯𝗲.𝗶𝗻𝗱𝗶𝗮𝗻 💀🇮🇳 (@tube__indian)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు