ప్రెగ్నెంట్‌ అంటూ... ప్లాస్టిక్‌ బొమ్మతో షాకిచ్చిన మహిళ!

10 Nov, 2022 14:06 IST|Sakshi

దంపతులకు పిల్లలు లేకపోతే పడే బాధ అంతా ఇంతా కాదు. నలుగురిలోనూ ఇబ్బందిగా ఉండి ఎక్కడికి వెళ్లలేక ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అచ్చం అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న ఒక మహిళ ఆ బాధ నుంచి తప్పించుకునే క్రమంలో ఆడిన నాటకమే ఆమెను పట్టుబడేలా చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే...40 ఏళ్ల మాహిళ పెళ్లై 18 ఏళ్లు అయినా పిల్లలు లేరు. చుట్టుపక్కల సూటిపోటీ మాటలకు బాధపడి తాను ప్రెగ్నెంట్‌ అని నాటకం ఆడింది. ఈ మేరకు ఆమె ప్రతి నెల స్థానిక ఆస్పత్రిలో చెకప్‌ చేయించుకునేందుకు వెళ్తుండేది. ఆ తర్వాత ఒకరోజు కడుపులో నొప్పిగా ఉందంటూ చెప్పి హడావిడి చేసి...నెలలు నిండకుండా బిడ్డ పుట్టిందంటూ ఒక ప్లాస్టిక్‌ బొమ్మను చూపించింది.

దీంతో కుటుంబ సభ్యులు ఆ బిడ్డను ఒక గుడ్డలో చుట్టి చెకప్‌ కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఉన్న వైద్యులు చెక్‌ చేసి ఇది బిడ్డ కాదని ఒక ప్లాస్టిక్‌ బొమ్మ అని తేల్చి చెప్పారు. అంతేకాదు వైద్యులు ఆమె హెల్త్‌ రిపోర్టులు తీసుకురమ్మని కుటుంబ సభ్యులకు చెప్పారు. వైద్యులు  తీసుకువచ్చిన ఆ ఎక్స్‌రే రిపోర్టులన్ని నకిలీవని తేల్చారు.

ఆమె ప్రతినెల చెకప్‌కి వెళ్తున్న ఆస్పత్రిని సైతం విచారించగా.....ఆమె కడుపులో ఇన్ఫక్షన్‌ ఉందంటూ ఆస్పత్రికి వచ్చేదని, ఆమె గర్భవతి కాదని చెప్పారు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్‌ అయ్యారు. పెళ్లి అయ్యి చాలా ఏళ్లైన పిల్లలు లేరంటూ తిడుతుంటే తట్టుకోలేక ఇలా కట్టుకథ అల్లానని చెప్పుకొచ్చింది సదరు మహిళ. 

(చదవండి: నిందితుడు అరెస్టు కాకూడదని..కారుతో సెక్యూరిటీ గార్డుని ఢీ కొట్టి...)

మరిన్ని వార్తలు