కిలేడీ ఎత్తుగడ..  బ్యాంకు దోచేయడానికి ఏకంగా 3 రోజులు

30 Jun, 2021 14:31 IST|Sakshi

షిల్లాంగ్‌ (మేఘాలయ): కూటి కోసం కోటి విద్యలనేది ఓ నానుడి. అయితే కొందరు అప్పనంగా కోట్లకు పడగెత్తాలనే అత్యాశతో చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడి కటకటాపాలవుతారు. తాజాగా మేఘాలయలోని బిష్ణుపూర్‌ శాఖ గ్రామీణ బ్యాంకును దోచుకోవడానికి వచ్చిన  ఓ కిలేడీని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఓ 40 ఏళ్ల మహిళ బ్యాంకులో గత శుక్రవారం డబ్బులు జమ చేయడానికి వచ్చింది. అయితే బ్యాంకును దోచేయాలనే ఉద్దేశంతో లోపలే ఉండిపోయింది.

శనివారం, ఆదివారం సెలవు కావడంతో బ్యాంకులో దోపీడీకి అనువుగా బావించింది. తాను బ్యాంకు లోపల చిక్కుకున్నానని ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. ఇక ముందస్తు ప్రణాళికతో ఆమె కొన్ని ఆహార పదార్థాలను కూడా తన వెంట తెచ్చుకుంది. అయితే డబ్బు సంచుల మూటలు ఉంటాయేమో పట్టుకెళ్తాననే భ్రమలో ఉన్న ఆ మహిళ ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించలేదు. సోమవారం బ్యాంకు మేనేజర్  లోపలికి అడుగుపెట్టినప్పుడు మహిళ అక్కడే ఉంది.. అని పోలీసులు పేర్కొన్నారు. మేనేజర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సదరు మహిళను అరెస్టు చేశారు.
చదవండి: వాట్సప్‌ చూస్తోందని చెల్లిని చంపిన అన్న 

మరిన్ని వార్తలు