లిఫ్ట్‌ పేరుతో సహోద్యోగిని కారు ఎక్కించుకుని.. అసభ్యకరంగా తాకుతూ..

13 Jul, 2022 21:28 IST|Sakshi

దేశంలో ప్రతీరోజు ఏదో ఒకచోట మహిళలు, యువతులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పనిచేస్తున్న చోట చూడా మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఓ యువతిపై కదలుతున్న కారులో లైంగికయత్నం జరిగింది. ఈ క్రమంలో తప్పించుకునేందుకు బాధితురాలు కారులోని బయటకు దూకింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ల‌క్నోలోని ఓ హెటల్‌లో యువతి(21) పనిచేస్తోంది. ఈ క్రమంలో హోటల్‌లో పని చేసే ఓ వ్యక్తి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తన బంధువు కూడా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తోందని.. తనకు సాయం చేయమని కోరాడు. ఇందుకు బాధితురాలు సరేనని చెప్పింది. అయితే, మంగళవారం హోటల్‌లో పనులు ముగించుకుని బాధితురాలు ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆమెను కారులో డ్రాప్‌ చేస్తానని కారు ఎక్కమని కోరాడు. అతడి మాటలు నమ్మిన ఆమె కారు ఎక్కింది.

అనంతరం కొద్ది దూరం వెళ్లిన త‌ర్వాత యువ‌తితో అస‌భ్యకరంగా ప్ర‌వ‌ర్తించ‌డంతో ఖంగుతింది. బాధితురాలు కారు ఆపాలని కోరినా ఆపకపోవడంతో జ‌నేశ్వ‌ర్ మిశ్రా పార్క్ వ‌ద్ద ఎస్‌యూవీ కారు నుంచి ఆమె కింద‌కు దూకింది. దీంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను వెంటనే మ‌నోహ‌ర్ లోహియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంతరం పోలీసులు.. బాధితురాల వద్దకి వెళ్లి స్టేట్‌మెంట్‌ తీసుకుని కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నామని, కారును సీజ్‌ చేసినట్టు ఏఎస్సీ శ్రీవాస్తవ పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: వివాహేతర సంబంధం: బైకుపై ఒంటరిగా వస్తుంటే..

మరిన్ని వార్తలు