కాటేసిన పాముతో ఆస్పత్రికి.. అది చూసి డాక్టర్లు షాక్‌

28 Oct, 2021 07:31 IST|Sakshi

సాక్షి, కెలమంగలం(కర్ణాటక): డెంకణీకోట తాలూకా బయలకాడు గ్రామానికి చెందిన మణి కూతురు సంచనశ్రీ (5) మంగళవారం సాయంత్రం ఇంటి ముందు ఆటలాడుతుండగా చిన్న సైజు కట్ల పాము కాటు వేసింది. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు పామును కొట్టి సంచిలో వేసుకొని చిన్నారిని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికెళ్లారు. పామును వైద్యులకు చూపించడంతో అక్కడివారు భయపడ్డారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో చిన్నారిని రక్షించగలిగామని డాక్టర్లు తెలిపారు.   

చదవండి: (ఉషా అందుకు నిరాకరిచండంతో.. చెరువు వద్దకు పిలిచి..) 

మరిన్ని వార్తలు