‘నేను చాలదా.. ఇంకొకడు కావాల్న’ అంటూ సజీవదహనం

10 Apr, 2021 18:00 IST|Sakshi

చెన్నె: ముందే వివాహేతర సంబంధం. ఆపై అతడు కాకుండా మరొక వ్యక్తితో సంబంధం కొనసాగించడంపై ఆమె ప్రియుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడి బంధం కొనసాగించకూడదని హెచ్చరించాడు. అయినా ఆమె పట్టించుకోకపోవడంతో అతడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి చివరకు ఆమెను హతమార్చాడు. బస్టాండ్‌లో నిద్రిస్తున్న ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడు చెన్నెలోని కొయంబేడులో చోటుచేసుకుంది. 

కొయంబేడులో ముత్తు (48), శాంతి (46) ఫుట్‌పాత్‌ నివాసితులు. వీరిది వివాహేతర సంబంధం. అయితే శాంతి అతడిని కాకుండా వేరే వ్యక్తితో కూడా సంబంధం కొనసాగిస్తోంది. ఇది తెలుసుకున్న ముత్తు ఆమెను వారించాడు. ఆమె వినిపించుకోకపోవడంతో శనివారం తెల్లవారుజామున 1.30 ప్రాంతంలో బస్టాండ్‌లోని ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న శాంతిపై పెట్రోల్‌ పోసి తగులపెట్టాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన స్థానిక వ్యాపారులు, ప్రయాణికులు వెంటనే ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే శాంతి మృతిచెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం కొద్దిసేపటికి ముత్తు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

చదవండి: సెల్ఫీ తీసుకుంటూ ఫోన్‌తో నీటిలోకి కొట్టుకుపోయిన బాలుడు
చదవండి: డబ్బుల్లేక భార్యతో గొడవ.. కూతుళ్లతో విషం తాగి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు