‘పిల్లలు కావాలి సార్‌.. నా భర్తకి పెరోల్‌ ఇ‍వ్వండి’

18 May, 2023 16:18 IST|Sakshi

భోపాల్‌: సెంట్రల్‌జైలు అధికారులకు ఓ మహిళ చేసిన అరుదైన అభ్యర్థన ప్రస్తుతం వార్తల్లోకెక్కింది. తనకు సంతానం కావాలని, అందుకు జైలులో ఉన్న తన భర్తను పెరోల్‌పై విడుదల చేయాలని ఆమె జైలు అధికారులకు దరఖాస్తు చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే..  శివపురికి చెందిన ఓ మహిళ దారా సింగ్ జాదవ్ అనే వ్యక్తిని కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే జాదవ్ హత్య కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇటీవల దారా సింగ్ జాదవ్ తండ్రి కరీం సింగ్ జాదవ్ అనారోగ్యానికి గురయ్యారు. చనిపోయేలోపు మనవడిని, మనవరాలిని చూడాలనుకున్నాడు.

దీంతో ఆ మహిళ తన భర్తను పెరోల్‌పై విడుదల చేయాలని జైలు అధికారులకు దరఖాస్తు చేసింది. ఈ విషయంపై గ్వాలియర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ విదిత్ సిరివియా మాట్లాడుతూ.. జీవిత ఖైదు శిక్ష పడ్డ ఖైదీలు వారి రెండేళ్లు శిక్షాకాలంలో మంచిగా ప్రవర్తిస్తే పెరోల్‌ పొందే అవకాశముందని చెప్పారు. అయితే ఈ పెరోల్ మంజూరు నిర్ణయం జిల్లా కలెక్టర్ చేతుల్లోనే ఉందని అధికారలు చెబుతున్నారు. గతంలోనూ రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ న్యాయస్థానం.. ఇటువంటి కేసులో ఓ ఖైదీకి 15 రోజుల పెరోల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: ఎంతకు తెగించారు.. అద్దెకు ఇల్లు తీసుకుని ఇంటినే డ్రగ్స్‌ ఫ్యాక్టరీగా మార్చారు!

మరిన్ని వార్తలు