షాకింగ్‌ వీడియో: రెచ్చిపోయిన రాజ్‌ థాక్రే అనుచరులు.. మహిళకు ఘోర అవమానం

1 Sep, 2022 16:54 IST|Sakshi

సాక్షి, ముంబై : మ‌హారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాజ్ థాక్రే అనుచరులు ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఆమెపై దాడి చేసి, చెప్పుల‌తో కొట్టారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వివరాల ప్రకారం.. ఆగ‌స్టు 28వ తేదీన మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ్ సేన(ఎంఎన్‌ఎస్‌) నాయ‌కుడు వినోద్ అర్గిలే నేతృత్వంలో ముంబా దేవి ఆల‌యం వ‌ద్ద ఎంఎన్‌ఎస్‌ పార్టీకి సంబంధించిన హోర్డింగ్ నిమిత్తం వెదురు క‌ట్టెల‌ను పాతారు. ఈ క్రమంలో ప్రకాశ్‌ దేవీ అనే మహిళ వారిని అడ్డుకుని తన షాపు ఎదుట వారి పార్టీకి సంబంధించిన హోర్డింగ్స్ పెట్టవద్దని చెప్పింది. 

అయితే, సదరు మహిళ మాటలను లెక్కచేయకుండా మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ్ సేన‌ అధ్య‌క్షుడు రాజ్ థాక్రే అనుచ‌రులు.. హోర్డింగ్స్‌ ఏర్పాటు చేశారు. దీంతో, సదరు మహిళ, కార్యకర్తల మధ్య వాగ్వాదం జరగడంతో రెచ్చిపోయిన కార్యకర్తలు.. ఆమెపై దాడి చేసి, చెప్పుల‌తో కొట్టి, తోసిపడేశారు. అంత‌టితో ఆగ‌కుండా ఆమెను అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించారు. కాగా, వారి దాడిలో మహిళ తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. అయితే, జరిగిన విషయంపై బాధితురాల పోలీసులను ఆశ్రయించినప్పటికీ.. వారు కేసు నమోదు చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

మరిన్ని వార్తలు