రెండో పెళ్లి కోసం తొమ్మిది నెలల పసికందుని 'అమ్మే'సింది

2 Oct, 2021 18:55 IST|Sakshi

​కొన్ని నెలలకే ఆమె భర్త నుంచి విడిపోయింది. పిల్లలు లేని ఒక జంటకు రూ. 3 లక్షలకు విక్రయం

చెన్నై: ప్రస్తుతం సమాజంలో వివాహ వ్యవస్థకు విలువ లేకుండా పోతోంది. భారతదేశ కుటుంబ వ్యవస్థ గురించి ప్రపంచ దేశాలన్ని ప్రశంసిస్తుంటే దానికి విరుద్ధంగా ఇటీవల కాలంలో ఎక్కువగా జంటలు విడిపోయి కుటుంబ వ్యవస్థకు అర్థం లేకుండా చేయడం అత్యంత బాధాకరం. ఒక వేళ వాళ్లకు పిల్లలు లేకపోతే సరే కానీ ఉంటే వారి పరిస్థితి గురించి ఇక  చెప్పవల్సిన అవసరం లేదు.  కానీ చెన్నైలోని ఒక జంట విడిపోయి మళ్లీ పెళ్లి చేసుకోవడం కోసం కన్న బిడ్డనే విక్రయించిన ఒక ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటన అందర్నీ విస్మయానికి గురి చేసింది.

(చదవండి: హక్కుల భంగం.. ఇదా మీ తీరు?)

వివరాల్లోకెళ్లితే చెన్నైలోని విరుధునగర్‌ జిల్లాకు చెందిన జెబమలార్‌(28) అనే ఆమెకు అదే జిల్లాకు చెందిన ఆర్‌ మణికందన్(38)తో  2019లో వివాహం జరిగింది. కొద్ది నెలలకు తమ వైవాహిక జీవితంలో సమస్యలు రావడంతో ఇద్దరు విడిపోయారు. పైగా వారికి తోమ్మిది నెలల బాబు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో జెబమలార్‌ తన బాబుని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెకు పునర్వివాహం చేయాలనకున్నారు, కానీ దీనికి ఆమె కొడుకు(9 నెలలు) అడ్డుగా ఉన్నాడని ఆ పసికందుని అమ్మేయాలని ఆమె, ఆమె తల్లిదండడ్రులు, సెల్వరాజ్‌, కురిబా, సోదరుడు ఆంటోని, మామా డానియెల్‌  భావించారు. దీంతో ఇద్దరూ బ్రోకర్లు కార్తికేయన్‌, జేసుదాసుని సంప్రదించారు. 

ఈ మేరకు ఆమె భర్త మణికందన్‌కి ఈ విషయాలు ఏమి తెలియదు. అయితే పిల్లలు లేని ఒక జంట సెల్వమణి,  అతని భార్య శ్రీదేవి దంపతులకు ఆ బాబును రూ. 3 లక్షలకు అమ్మేశారు.  ఈ మేరకు మణికందన్‌ తన బిడ్డ కోసం జెబమలార్‌ దగ్గరకు వెళ్తే బిడ్డ లేదు. దీంతో మణికందన్‌ అనుమానంతో  పోలీసులను సంప్రదించాడు. ఈ క్రమంలో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులు ఆ పిల్లడిని కొనుగోలు చేసిన దంపతులను, మీడియేటర్లను అరెస్ట్‌ చేశారు. మరోవైపు ఆ పసికందు తల్లి జెబమలార్‌ ఆమె సంబంధికులు పరారీలో ఉన్నారు. ఇటీవల  ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని ఒక జంట తమ పెద్ద కూతురి(16)  వైద్య చికిత్స నిమిత్తం తమ 12 ఏళ్ల చిన్న కూతురిని తమ పొరుగువారికి విక్రయించిన సంఘటన మరిచిపోకముందే ఈ ఘటన జరగడం బాధాకరం.

(చదవండి: స్పైసీ మ్యాగీ మిర్చి గురూ)

మరిన్ని వార్తలు