దేశం కోసం మహిళా టీచర్‌ సాహసం

3 Aug, 2021 07:15 IST|Sakshi
బుల్లెట్‌పై వెళ్తున్న టీచర్‌ రాజ్యలక్ష్మి

సాక్షి, చెన్నై: దేశ సమైక్యతను కాంక్షిస్తూ మహిళా టీచరు బుల్లెట్‌ పయనానికి శ్రీకారం చుట్టారు. తమిళనాడుతో అనుబంధం ఉన్న టీచర్‌ రాజ్యలక్ష్మి ఢిల్లీలో పని చేస్తున్నారు. ఈమె దేశంపై యువతలో చైతన్యం, అవగాహన కల్పించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మదురై గోరిపాలయం నుంచి ఆమె తన ప్రయాణం మొదలెట్టారు. బుల్లెట్‌ నడుపుకుంటూ, మార్గమధ్యలో ఆయా ప్రాంతాల్లో అవగాహన కల్పించి, దేశ సమైక్యతే లక్ష్యంగా ముందుకు సాగారు.

ఆమె వెన్నంటి క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన 12 మంది, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మరో 12 మంది యువకులు మోటారు సైకిళ్ల మీద వెళ్లనున్నారు. చెన్నై, బెంగళూరు, నాగ్‌పూర్, ఢిల్లీ మీదుగా హిమాచల్‌ ప్రదేశ్‌ వరకు 4450 కి.మీ దూరం 19 రోజుల పాటు ఈ ప్రయాణం సాగనుంది. అలాగే ధర్మపురి జిల్లా పెన్నగరం సమీపంలోని ఒప్పగౌండన్‌ హల్లిలో సమాచార శాఖ నేతృత్వంలో గ్రంథాలయం నిర్మించారు. ఇక్కడే భరతమాత స్మారక ఆలయాన్ని సైతం ఏర్పాటు చేయగా, వీటిని మంత్రి స్వామినాథన్‌ ప్రారంభించారు.  

మరిన్ని వార్తలు