ఆమె కోసం అతడుగా మారిన టీచర్‌!

8 Nov, 2022 14:03 IST|Sakshi

ప్రేమ ఎంతపనైనా చేయిస్తుందనడంలో సందేహం లేదు. అందుకు సంబంధించిన పలు ఘటనలు ఎన్నో చూశాం. అచ్చం అలానే ఇక్కడొక మహిళ తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకునేందుకు అతడిగా మారింది.

వివరాల్లోకెళ్తే...రాజస్తాన్‌కి చెందిన కుంతల్‌ అనే పీటీ టీచర్‌ తన విద్యార్థి కల్పనా ఫౌజ్దార్‌తో ప్రేమలో పడింది. అదీగాక కల్పన రాష్ట్రస్థాయి కబడ్డీ ప్లేయర్‌. దీంతో వారి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగి ‍ ప్రేమగా మారిందని చెబుతోంది ఆ జంట. అంతేకాదు ఆ మహిళ టీచర్‌ తను ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయిగా మారాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు పేర్కొంది.

తాను మహిళాగా జన్మించినప్పటికీ తాను అబ్బాయిగానే భావించేదాన్ని అని చెబుతోంది కుంతల్‌. ఈ మేరకు సదరు టీచర్‌ 2019లో సర్జరీ చేయించుకుని అతడుగా మారింది. ఆ తర్వాత ఆ టీచర్‌ తన పేరుని ఆరవ్‌గా మార్చుకుంది. ఈ క్రమంలో ఆమె ప్రియురాలు కల్పన మాట్లాడుతూ.... తనకు మొదటి నుంచి ఆమె అంటే ఇష్టం అని సర్జరీ చేయించుకోకపోయినా ఆమెనే పెళ్లి చేసుకునే దాన్ని అని చెబుతోంది. భారతీయ సామాజిక నిబంధనలకు తమ విహహం విరుద్ధమైనా తమ తల్లిదండ్రులు అంగీకరించారని ఆ జంట ఆనందంగా చెబుతోంది.

(చదవండి: తప్పతాగి మహిళ గదిలో నగ్నంగా.. ప్రముఖ కంపెనీ అధికారి నిర్వాకం వెలుగులోకి!)

మరిన్ని వార్తలు