బడిలోనే బార్‌.. ఆ టీచరమ్మ రూటే వేరు  

9 Sep, 2022 07:07 IST|Sakshi
మద్యం బాటిళ్లు,  టీచర్‌ గంగలక్ష్మమ్మ

తుమకూరు (బెంగళూరు): గురువు అంటే దేవునితో సమానం, కానీ ఓ మహిళా ఉపాధ్యాయురాలు పాఠశాలనే బార్‌గా మార్చుకుంది. మద్యం తాగుతూ మత్తులో నానా యాగీ చేస్తూ ఆ వృత్తికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది. ఈ సంఘటన విద్యాకేంద్రంగా ప్రసిద్ధి చెందిన తుమకూరు జిల్లాలో జరిగింది. వివరాలు.. తుమకూరు తాలూకాలోని చిక్కసారంగిలోఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గంగలక్ష్మమ్మ అనే ఉపాధ్యాయురాలు గత 25 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తోంది. గత 5 సంవత్సరాల నుంచి ఆమె మద్యానికి బానిస అయ్యింది.  ఈ మత్తులో  నానా హంగామా చేస్తోంది.
 
టేబుల్‌లో మద్యం సీసాలు  
ఈ విషయమై గ్రామస్తులు, బాలల తల్లిదండ్రులు ఆమెకు అనేకసార్లు మందలించినా తీరుమారలేదు. దీంతో బీఈఓకు ఫిర్యాదు చేయడంతో గురువారం వచ్చి విచారించారు. ఉపాధ్యాయురాలి టేబుల్‌లో మద్యం సీసాలు ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. వాటిని తీయాలని బీఈఓ ఆదేశించడంతో ఆమె టేబుల్‌కు తాళం వేసి భీష్మించుకుంది. బీఈఓ, తల్లిదండ్రులు కలిసి టేబుల్‌ను బయటికి తీసుకొని వచ్చి తాళం పగలగొట్టి చూసి ఒక బాటిల్, రెండు ఖాళీ సీసాలు ఉన్నాయి. ఇంతలో నేను ఆత్మహత్యా చేసుకుంటానంటూ ఉపాధ్యాయురాలు కేకలు వేయగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.  మద్యం సీసాలను సీజ్‌చేశారు. 

చదవండి: (ట్రూ లవ్‌ నెవర్‌ ఎండ్స్‌.. నేనూ నీ దగ్గరకే వస్తున్నా..) 

మరిన్ని వార్తలు