సెక్యూరిటీ గార్డ్‌ను చితకబాదిన జంతు ప్రేమికురాలు.. వీడియో వైరల్‌!

15 Aug, 2022 15:18 IST|Sakshi

లక్నో: వీధి శునకాలపట్ల క్రూరంగా ప్రవర్తించాడనే కారణంతో ఓ రెసిడెన్షియల్‌ సొసైటీ సెక్యూరిటీ గార్డ్‌పై ఆగ్రహంతో ఊగిపోయింది ఓ మహిళ. పెద్ద కర్రతో కొడుతూ తిట్ల వర్షం కురిపించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ వీడియో పోలీసులకు చేరటంతో మహిళపై కేసు నమోదు చేసినట్లు ఆగ్రా పోలీసులు తెలిపారు. వీడియోలోని ఆ యువతి తాను జంతు హక్కుల కార్యకర్తగా చెప్పినట్లు వెల్లడించారు.

ఈ వీడియోలో.. 20 ఏళ్లుపైబడిన ఓ మహిళ సెక్యూరిటీ గార్డుపై ఆగ్రహంతో ఊగిపోతోంది. పెద్ద కర్ర తీసుకుని చితకబాదుతూ తిట్ల వర్షం కురిపించింది. అంతే కాకుండా వీధి శునకాల పట్ల కూర్రంగా ప్రవర్తించావని భాజపా ఎంపీ, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీకి ఫిర్యాదు చేస్తానని బెదిరించింది ఆ మహిళ. ఈ సంఘటనపై ఆగ్రా నగర ఎస్పీ వికాస్‌ కుమార్‌ వివరాలు వెల్లడించారు. ‘సెక్యూరిటీ గార్డును ఓ మహిళ కర్రతో కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో ఆధారంగా మహిళపై చట్టపరమైన చర్యలు చేపట్టారు ఆగ్రా పోలీసులు.’ అని తెలిపారు. 

మరోవైపు.. ఎల్‌ఐసీ ఆఫీసర్‌ కాలనీలో పని చేస్తున్న బాధితుడు అఖిలేశ్‌ సింగ్‌ తమకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు న్యూఆగ్రా పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ విజయ్‌ విక్రమ్‌ సింగ్‌. వైరల్‌ వీడియోలో ఉన్న మహిళ నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఎల్‌ఐసీ ఆఫీసర్‌ కాలనీలో పని చేస‍్తున్న క్రమంలో అటుగా వచ్చిన వీధి కుక్కలను తరిమేసేందుకు షూను వినియోగించినట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. తాను ఎక్స్‌ సర్వీస్‌మెన్‌గా తెలిపాడు బాధితుడు.

ఇదీ చదవండి: ఓలా డ్రైవర్‌పై రెచ్చిపోయిన గ్యాంగ్‌.. అరగంట ఆలస్యమైనందుకు దాడి.. రౌడీల్లా రాత్రంతా బంధించి..

మరిన్ని వార్తలు