‘అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లనే అత్యాచారాలు’

10 Jun, 2021 17:15 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్ యూపీ మహిళా కమిషన్‌ సభ్యురాలు మీనా కుమారి అత్యాచారాలకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలికలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకూడదని దీని పరిణామాలే అత్యాచారాలకు దారి తీస్తాయన్నారు. ఆలీఘర్‌లో మహిళలకు సంబంధించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో ఆమె ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

కాగా అమ్మాయిలను మొబైల్ ఫోన్‌లకు దూరంగా ఉంచాలని ఆమె ఈ సందర్భంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మొదట అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడుతారు ఆ తరువాత వారితో పారిపోతారన్నారు. కాగా  రాష్ట్రంలో అత్యాచారం కేసులు గణనీయంగా పెరిగాయి అనే ప్రశ్నకు సమాధానంగా కుమారి ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీ మహిళా కమిషన్ మాత్రం మీనా కుమారి వ్యాఖ్యలను సమర్థించలేదు. కమిషన్ ఉపాధ్యక్షుడు అంజు చౌదరి, కుమారి వ్యాఖ్యలు తప్పని, అమ్మాయిలను ఫోన్లకు దూరంగా ఉంచినంత మాత్రాన అత్యాచారాలకు తగ్గుదలకు ఇవి పరిష్కారం కాదన్నారు. 

చదవండి: ‘‘దేవుడి ఆధార్‌ కార్డ్‌ తెస్తేనే.. పంట కొంటాం’’

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు