గతంలో ఆ ఉద్యోగాలు పురుషులకే పరిమితం.. కానీ ప్రస్తుతం ట్రెండ్‌ మారింది!

9 Mar, 2022 14:44 IST|Sakshi
రైలు నడుపుతున్న లోకో పైలెట్‌ అంబికా అంకలిగి

సాక్షి,బళ్లారి: ఇంటి నుంచి మింటి వరకు దూసుకెళ్తున్న నారీమణులు రైళ్లను కూడా నడిపిస్తున్నారు. ఒకప్పుడు పురుషులకే పరిమితమైన లోకోపైలెట్‌ ఉద్యోగాల్లో మహిళలు కూడా కొలువుదీరి సత్తా చాటుతున్నారు. మంగళవారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హుబ్లీ రేల్వే అధికారులు హుబ్లీ నుంచి గదగ్‌ మీదుగా కారటిగి వెళ్లే రైలు నిర్వహణను మహిళా సిబ్బందికే అప్పగించారు.

లోకో పైలెట్, టీటీఈలు, పోలీసులు ఇతర సిబ్బంది మొత్తం 15 మంది మహిళలను నియమించి రైలు నడిపించారు. అంబికా అంకలిగి అనే మహిళా పైలెట్‌ ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా 200 కిలోమీటర్ల మేర రైలును నడిపించారు. మహిళా దినోత్సవం రోజున రైలును నడిపే బాధ్యతలను తమకు అప్పగించినందుకు సంతోషంగా ఉందన్నారు.

మరిన్ని వార్తలు