మొదటిసారి ప్రయోగాత్మకంగా.. తగ్గేదే లేదంటున్న కర్ణాటక మహిళా పోలీసులు

26 Nov, 2021 08:24 IST|Sakshi
విధుల్లో ఉన్న మహిళా పోలీసులు

మైసూరు(బెంగళూరు): రాత్రి గస్తీలో పురుష పోలీసులకు దీటుగా తాము కూడా పనిచేయగలమని మహిళా పోలీసులు నిరూపించారు. ఈమేరకు బుధవారం రాత్రి మైసూరులోని నంజనగూడు పోలీస్‌ ఉప విభాగం పరిధిలో మహిళా పోలీసులు రాత్రి గస్తీ విధులు  నిర్వహించారు.  బుధవారం రాత్రి 9 గంటలనుంచి గురువారం తెల్లవారుజామున 6 గంటలవరకు విధులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆర్‌.చేతన్‌ మాట్లాడుతూ  రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రయోగాత్మకంగా మహిళా పోలీసులను రాత్రి గస్తీ విధులకు పంపగా వారు ధైర్యంగా విధులు నిర్వహించారన్నారు.

మరో ఘటనలో..
బిడ్జి మరమ్మతులకు ప్రతిపాదన 
కేజిఎఫ్‌:
ఇటీవల కురిసిన వర్షాలకు తాలూకాలోని రామసాగర చెరువు మరువపోయి పాలారు నదికి అడ్డుగా నిర్మించిన బ్రిడ్జి తెగిపోయిందని, దీనికి మరమ్మతులకు గాను రూ. 2 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు ఎమ్మెల్యే రూపా శశిధర్‌ తెలిపారు. గురువారం బాపనేహళ్లి వద్ద తెగిపోయిన బ్రిడ్జిని ఆమె పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట ఏఈఈ శేషాద్రి తదితరులు ఉన్నారు. 

చదవండి: నా భర్త నాకు కావాలి.. అత్తవారింటి మెట్లపైన కోడలి పూజలు

మరిన్ని వార్తలు