దేవుడి పేరుతో మహిళల అర్ధనగ్న ఊరేగింపు

26 Feb, 2021 14:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బళ్లారి: సభ్యసమాజం తలదించుకునే విధంగా అనాగరిక చర్య అక్కడ కొనసాగుతోంది. ఉత్తర కర్ణాటకలోని యాదగిరి జిల్లా సురపురలో దేవుడి పేరుతో మహిళలను అర్ధనగ్నంగా సగం శరీరానికి వేపాకులు కట్టుకుని నడివీధుల్లో ఊరేగించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం దేవుడు పేరుతో మహిళల బట్టలను తీసి ఊరేగించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ అనాగరిక చర్యలు యాదగిరి జిల్లాలో ఒక్క సురపుర పట్టణంలోనే కాకుండా పలు ప్రాంతాల్లో అనాదిగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల మాన, ప్రాణ రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ఇలాంటి అసాంఘీక చర్యలకు పాల్పడుతుండటంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇది సంప్రదాయమని పలువురు సమర్ధించుకుంటున్నారు.

చదవండి: రవై ఏళ్ల వయస్సులో ఇదేం పాడుపని..!

మరిన్ని వార్తలు