నువ్వు లేకుంటే బతకలేనన్నాడు.. లవరే కదా అని ఆమె దగ్గరైంది.. అక్కడే ట్విస్ట్‌

10 Sep, 2022 18:43 IST|Sakshi

నువ్వుంటే ఇష్టమంటూ ఆమెకు దగ్గరయ్యాడు. ఐ లవ్‌ యూ అని చెప్పి ప్రేమ పేరుతో ఆమెను వంచించాడు. శారీరకంగా ఆమెకు దగ్గరై.. గర్భవతిని చేశాడు. చివరకు పెళ్లి విషయం ఎత్తడంతో అతడి గురించి అసలు విషయం తెలిసి.. ఆమె షాకైంది. పేరు మార్చుకుని తనను మోసం చేశాడని గుర్తించి ఆవేదనకు లోనైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. యూపీలో ఉన్నావ్‌ చెందిన బాధితురాలికి.. మోనూ పేరుతో ఓ వ్యక్తి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఆమె అంటే ఇష్టమన్నాడు. ఆమె లేకుంటే బ్రతకలేనంటూ నమ్మించాడు. చివరకు పెళ్లి చేసుకుంటానని ప్రామిస్‌ చేశాడు. ఇవన్నీ నమ్మిన బాధితురాలు ఓ తప్పు చేసింది. కాబోయే భర్తే కదా అని.. పలుమార్లు శారీరకంగా దగ్గరైంది. ఈ క్రమంలో గర్భం దాల్చింది. దీంతో కంగారుపడిన మోనూ.. ఆమెను మళ్లీ మోసం చేసి.. గర్భాన్ని తొలగించేశాడు.

అనంతరం, పెళ్లి చేసుకోవాలని మోనూను కోరింది. కాగా, పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి బాధితురాలి వద్ద నుంచి రూ.2 లక్షలు నొక్కేశాడు. ఇక లాభం లేదని బాధితురాలు.. పెళ్లి విషయమై నిలదీయడంతో కనిపించకుండా పోయాడు. దీంతో, బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. అతడి పేరు మోనూ కాదని.. అసలు పేరు షెహ్నవాజ్ కబాడీ అని తెలియడంతో ఖంగుతింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

మరిన్ని వార్తలు