ఓ తల్లి దయనీయగాథ.. భుజాలపై పిల్లాడితో

13 Jun, 2021 03:07 IST|Sakshi
దావణగెరెలో భోజనం చేస్తున్న తల్లీ కొడుకులు 

సాక్షి, యశవంతపుర: భర్తతో గొడవ పడిన ఓ మహిళ తన ఐదేళ్ల కొడుకును తీసుకుని 90 కిలోమీటర్లు నడిచి వెళ్లిన ఘటన కర్ణాటకలో దావణగెరెలో వెలుగులోకి వచ్చింది. శివమొగ్గ జిల్లా గాడికొప్పకు చెందిన నాగరత్న ఏదో విషయమై భర్తతో తగాదా పడింది. దిక్కుతోచని స్థితిలో కొడుకును, బట్టల సంచిని తీసుకుని బిజాపుర (విజయపుర) జిల్లా హరప్పనహళ్లి తాలూకా తుంబికెరెలోని అక్క ఇంటికి బయలుదేరింది. బస్సులు లేవు, చేతిలో డబ్బులు కూడా కరువు. దీంతో ఆమె నడకనే నమ్ముకుంది.

శుక్రవారం రాత్రి 9.30 గంటలకు దావణగెరె నగరంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా నాగరత్న ఎస్‌ఎస్‌ ఆస్పత్రి వద్ద కంటపడ్డారు. పోలీసులు ప్రశ్నించగా భర్తతో కొట్లాడి కొడుకును భుజాలపై మోసు కుంటూ అక్క ఇంటికి కాలినడకన వెళ్తున్నట్లు వారికి వివరించింది. ఇలా ఆమె 90 కిలోమీటర్లు నడిచినట్లు తెలిసి పోలీసులే విస్తుపోయారు. తల్లి, కొడుకుకు పోలీసులు భోజనం పెట్టించి తమ వాహనంలో తుంబికెరెలోని ఆమె సోదరి ఇంటికి పంపించారు.

మరిన్ని వార్తలు