విశాల్‌ ఐ లవ్‌ యూ.. ప్లీజ్‌ నన్ను తీసుకెళ్లు నీ కుసుమ్‌

20 Apr, 2022 18:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప‍్రస్తుత జనరేషన్‌ మొత్తం ఫోన్‌లోనే సందేశాలు పంపుతున్నారు. లవ్‌ ప్రపోజల్‌ నుంచి పెళ్లి వేడుక వరకు అంతా స్మార్ట్‌ ఫోన్‌లోనే జరిగిపోతున్నాయి. ఒకప్పటిలా గ్రీటింగ్‌ కార్డు, పోస్టు కార్డుల కాలం చెల్లిపోయింది. ఇలాంటి తరుణంలో తన వద్ద ఫోన్‌ అందుబాటులో లేని ఓ యువతి రూ.10 నోటుపై ప్రేమ రాయబారం పంపడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఓ పది రూపాయల నోటుపై.. "విశాల్ నా పెళ్లి ఏప్రిల్ 26న ఫిక్స్ అయ్యింది. మనం లేచిపోదాం. నిన్ను ప్రేమిస్తున్నాను. నీ కుసుమ్" రాసి ఉంది. కుసుమ్‌ అనే మహిళ తన లవర్‌ కోసం ఇలా రాసింది. కాగా, కుసుమ్‌, విశాల్‌ ఎవరు అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఇదిలా ఉండగా ఈ నోట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. నెటిజన్ల అభిప్రాయం ప్రకారం.. కుసుమ్ అనే యువతి.. విశాల్‌ని ప్రేమిస్తోంది. కానీ, ఆమె తల్లిదండ్రులు మాత్రం కుసుమ్‌ను ఇంట్లో బంధించి.. తన దగ్గర ఫోన్‌ లేకుండా చేసి మరో వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. ఏప్రిల్ 26వ తేదీన ఆమె వివాహానికి డేట్ ఫిక్స్ చేశారు. దీంతో ఎలాగైనా విశాల్‌కు పెళ్లి విషయం తెలియాలని కుసుమ్‌ ఇలా చేసింది. వారిద్దరూ కలిసి బతికేందుకు విశాల్‌తో లేచిపోవడానికి కూడా రెడీ అయినట్టు నోటుపై క్లియర్‌గా రాసింది.


అయితే, ఇది నిజంగానే రాశారా..? లేక ఎవరైనా సరదాగా రాశారా..? అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా, ఇలా కరెన్సీ నోట్లపై రాతలు రాయడం భారతీయ చట్టాల ప్రకారం నేరం. కాబట్టి ఇలాంటి రాతలు రాయకపోవడమే మంచిదని కొందరు నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. మరికొందరు మాత్రం.. "విశాల్ సరైన సమయానికి చేరుకుంటే.. ఆమె అతనితో పారిపోతుందా?" కామెంట్స్‌ చేశాడు.

మరిన్ని వార్తలు