World Anti Obesity Day: ఈ ఏడు సూత్రాలు పాటించండి చాలు!

26 Nov, 2021 11:45 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఊబకాయుల సంఖ్య 1980 నుండి రెట్టింపు అవుతూ వస్తుంది. 2014లో, 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 1.9 బిలియన్ల కంటే ఎక్కువ మంది పెద్దలు అధిక బరువుతో ఉన్నారు. వీరిలో 600 మిలియన్లకు పైగా స్థూలకాయులు ఉన్నారు. 2014లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 41 మిలియన్ల మంది పిల్లలు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. 

'CRAP': కు దూరంగా ఉండండి. అంటే కార్బోనేటేడ్ పానీయాలు,శుద్ధి చేసిన చక్కెరలు, కృత్రిమ స్వీటెనర్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. స్థూలకాయానికి దూరంగా ఉండాలంటే ఈ పదార్థాలకు కచ్చితంగా నో  చెప్పాల్సిందే.

బ్రేక్‌ ఫాస్ట్‌ స్కిప్‌ చేద్దామా?
అల్పాహారాన్ని ఎప్పుడూ దాటవేయవద్దు అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. కింగ్‌లాగా బ్రేక్‌ ఫాస్ట్‌ ఉండాలి అలా ఆరోగ్యకరమైన, శక్తినిచ్చే ఆహారంతో రోజు ప్రారంభించాలి.  బ్రేక్‌ఫాస్ట్‌ స్కిప్‌ చేసే  ఆకలి ఎక్కువై  ఫాస్ట్ ఫుడ్ వైపు మళ్లే అవకాశం ఉంది. 

మనం ఏం తాగుతున్నాం:  ఈ మధ్య కాలంలో  లెమన్‌ టీ, గ్రీన్‌ టీ పై అవగాహన బాగా పెరిగింది.  గ్రీన్ టీ, దాల్చిన చెక్క టీ,  అల్లం టీ, తులసి, పుదీనా టీ ఇలాంటి సహజ మూలికల టీ తాగడం వల్ల  శరీరంలో కొవ్వు నిల్వలు  క్రమేపీ కరుగుతాయి.  అలాగే సాధ్యమైనంత ఎక్కువ నీరుతాగడం వల్ల జీర్ణవ్యవస్థ నియంత్రణలో ఉంటుంది. నీరు మన శరీరంలోని మలినాలను కూడా శుభ్రపరుస్తుంది.

వంటింట్లో డైట్ మేక్-ఓవర్ :  వంటగదిలో "జంక్" ఫుడ్‌ని పూర్తిగా తొలగించేద్దాం. దీనికి బదులు వంట గదిలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మొలకెత్తిన గింజలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను  కనిపించేలా పెట్టుకోండి.  ఫ్రూట్ లేదా వెజిటబుల్ సలాడ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వండి.  రుచికోసం కొద్దిగా నిమ్మరసం యాడ్‌ చేసుకుంటే..రుచికి రుచితోపాటు జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.

మోర్‌ ఎక్సర్‌సైజ్‌: ఆరోగ్యంగా ఉండాలంటే  నిరంతరం చురుగ్గా ఉండటం.  ఎక్కువ సేపు  కుర్చీలకు, సోఫాలకు అతుక్కుపోకుండా ఉండటం చాలా ముఖ్యం. లిఫ్ట్‌కు కాకుండా సాధ్యమైన ప్పుడల్లా మెట్లు ఎక్కడం. అలాగే మన రోజువారీ షెడ్యూల్‌లో  సైక్లింగ్, నడక, స్కిప్కింగ్‌ లేదా స్విమ్మింగ్‌తోపాటు, పెంపుడు జంతువుతో షికారు చేస్తే మనసుకి హాయిగా ఉంటుంది.

మింగేయకండి.. నమలండి: తిన్నది ఎంతైనాగానీ ఆహారాన్ని బాగా నమలండి. తిన్న ప్రతిసారీ మీ పోర్షన్ పరిమాణాన్ని తగ్గించుకుంటే..తక్కువ కేలరీలు తగ్గుతాయి. ప్రతీ ముద్దా ఎంత ఎక్కువ నమిలితే అంత మంచిది.  తద్వారా కేలరీల మోతాదు తగ్గుతాయి.  పోషకాలు పెరుగుతాయి.

ఇంటి భోజనమే అమృతం: ఆర్డర్‌ చేసుకున్న ఫుడ్‌ వేస్ట్‌ అయిపోతోందనో, టేస్టీగా ఉందనో ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  సో..సాధ్యమైనంతవరకు ఇంటిలో  తయారు చేసిన  ఫుడ్‌ తినడం ఉత్తమం. లేదంటే ఆ తరువాత అద్దం ముందు నిలబడి, ఏం తిన్నా.. ఇక్కడికే వస్తోంది అనుకోవాలి పెరుగుతున్న నడుమును చూసి.

మరిన్ని వార్తలు