38 భార్యల ముద్దుల భర్త ఇక లేరు

13 Jun, 2021 21:28 IST|Sakshi

ఐజ్వాల్: ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్ద జియోన చన (78) ఇకలేరు. అతడికి 38 మంది భార్యలు.. 89 మంది మగ పిల్లలు.. 14 మంది కుమార్తెలు.. 33 మంది మనవరాళ్లు.. ఒక మనవడు ఉన్నారు. వీరి కుటుంబంలో మొత్తం 176 మంది సభ్యులు ఉన్నారు. కాగా జియోన మరణంపై మిజోరాం ముఖ్యమంత్రి జోరాంతంగ స్పందించారు. 

ఆయన కుటుంబం ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్ద అయిన మిజోరాం వాసి మిస్టర్ జియోన్‌కు బరువైన హృదయంతో వీడ్కోలు పలుకుతున్నాను. ఆయనకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు ఉన్నారు. ఆయన గ్రామం బక్తంగ్ త్లంగ్నాంతో పాటు మిజోరాంకు కూడా అనేక మంది పర్యాటకులు రావడానికి ఆయన కుటుంబం ఒక కారణం’’ అని సీఎం జోరాంతంగ ట్వీట్ చేశారు.

చదవండి: భట్టి: ప్రజల అవసరాల కోసం ఆస్తులు... అమ్మకానికి కాదు

మరిన్ని వార్తలు