సంక్షోభంలో ప్రపంచం

13 Jan, 2023 06:25 IST|Sakshi

న్యూఢిల్లీ:  ప్రపంచం మొత్తం సంక్షోభ స్థితిలో చిక్కుకుందని ప్రధాని∙మోదీ స్పష్టం చేశారు. ఈ అనిశ్చిత పరిస్థితి ఇంకా ఎంతకాలం ఉంటుందో చెప్పడం చాలా కష్టమని అన్నారు. ఈ నేపథ్యంలో మనం తయారు చేయని వ్యవస్థలు, పరిస్థితులపై ఆధారపడడం సరైంది కాదని గ్లోబల్‌ సౌత్‌కు సూచించారు. 21వ శతాబ్దంలో ప్రపంచ అభివృద్ధికి దక్షిణాది దేశాలే చోదక శక్తులని తేల్చిచెప్పారు.

గురువారం ‘వాయిస్‌ ఆఫ్‌ గ్లోబల్‌ సౌత్‌’ వర్చువల్‌ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆహారం, ఇంధనం, ఎరువుల ధరల పెరుగుదల, ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌–19 ప్రభావం, వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తున్న ప్రకృతి విపత్తులపై ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం మనందరికి కొంగొత్త ఆశలు, నూతన శక్తిని తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలను గ్లోబల్‌ సౌత్‌గా వ్యవహరిస్తారు.

మరిన్ని వార్తలు