బాక్సర్‌నే ఆశ్చర్యపరుస్తున్న బుడ్డోడు!

3 Sep, 2020 12:53 IST|Sakshi

చాలా మంది ఆరోగ్యం కోసం రోజు ఎక్సర్‌సైజ్‌లు చేద్దామనుకొని బద్దకంతో వదిలేస్తూ ఉంటారు. అయితే ఈ వీడియో మీరు చూస్తే కచ్ఛితంగా మీకు స్ఫూర్తి కలుగుతుంది. ఈ వీడియోలో ఒక బుడ్డోడు ఆగకుండా పుల్‌అప్స్‌ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ వీడియోలను ఇండియన్‌ బాక్సర్‌ భజరంగ్‌ పూనియా తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. 23 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఒక చిన్న పిల్లవాడు పుల్‌ అప్స్ చేస్తున్నాడు. వాళ్ల ఇంటిలోని వారందరూ శభాష్‌ అంటుంటే ఇంకా ఉత్సాహంగా పుల్‌అప్స్‌ చేస్తూ చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. 


ఈ వీడియోను పోస్ట్ చేసిన పూనియా ‘వచ్చే ఛాంపియన్‌ షిప్‌ కోసం ఇప్పుడే ప్రాక్టీస్‌ మొదలు పెట్టాడు’ అనే కాప్షన్‌ను జోడించారు.  ఈ వీడియోను ఇప్పటికే 53000ల మందికి పైగా వీక్షించారు. 7 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. తన గురువు చెప్పినట్లు చక్కగా సాధన చేస్తున్నాడు అని కొంతమంది కామెంట్‌ చేయగా, చాలా మంది ఆ చిన్నారికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు.  

చదవండి: వేడిగా ఉందని.. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ తెరిచింది

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు