ఈ ఏడాది ఎండలు మామూలుగా ఉండవు

5 Mar, 2021 10:53 IST|Sakshi

బెంగళూరు : ఈ ఏడాది వేసవిలో సూర్యుని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణశాఖ తెలిపింది.  మండే ఎండలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడులో వేసవి ప్రతాపం చూపవచ్చు. ఎండలు రికార్డు స్థాయిలో ఉండవచ్చు. వేసవి కాలంలో ఉదయం నుంచి ఎండలు పెరిగి సాయంత్రం సమయానికి  ఉష్ణోగ్రత తగ్గుతుంది. కానీ ఈ వేసవిలో  విపరీతమైన ఉక్కపోత చుట్టుముడుతుందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో వేసవి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్‌ చేరే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు