మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు.. రామ్‌దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు..

26 Nov, 2022 11:10 IST|Sakshi

ముంబై: యోగా గురు రామ్‌దేవ్ బాబా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర థానెలో శుక్రవారం జరిగిన యోగా సైన్స్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 'మహిళలు చీరకట్టులో అందంగా కన్పిస్తారు. సల్వార్ సూట్స్‌లోనూ బాగుంటారు. ఇంకా చెప్పాలంటే నా దష్టిలో వాళ్లు అసలు దుస్తులు ధరించకపోయినా అందంగానే ఉంటారు.' అని రాందేవ్ బాబా నోరుపారేసుకున్నారు.

రామ్‌దేవ్ బాబా పాల్గొన్న ఈ కర్యక్రమానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్, సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే కూడా హాజరయ్యారు. వాళ్ల సమక్షంలో రామ్‌దేవ్ బాబా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇది రాజకీయంగానూ దుమారం రెపే సూచనలు కన్పిస్తున్నాయి.

రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యలను మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్‌ తీవ్రంగా ఖండించారు. రామ్‌దేవ్ బాబా అసలు మనస్తత్వం ఏంటో బయటపడిందని విమర్శలు గుప్పించారు. మహిళలకు ఆయన ఇచ్చే గౌరవం ఏంటో తెలుస్తోందన్నారు.
చదవండి: కొలీజియం పరాయి వ్యవస్థ

మరిన్ని వార్తలు