రైతుల కోసం 19 ఏళ్ల కుర్రాడి అద్భుత ఆవిష్కరణ!

29 Mar, 2021 19:37 IST|Sakshi

రాజస్థాన్‌లోని బారన్ జిల్లాలోని బమోరికల గ్రామానికి చెందిన 19 ఏళ్ల యోగేష్ అనే ఒక యువ రైతు ఎవరూ సహాయం లేకుండా నడిచే సరికొత్త డ్రైవర్ లెస్ ట్రాక్టర్ ను ఆవిష్కరించాడు. డ్రైవర్‌ సాయంతో నడిచే ట్రాక్టర్‌లో మార్పులు చేసి ఈ ఘనత సాధించాడు. యోగేష్ బీఎస్సి ఫస్ట్ చదువుతున్నాడు తన తండ్రికి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే ఇంటికి రావాలని అని ఫోన్ వచ్చింది. తండ్రి ఆరోగ్యం కుదుట పడే వరకు అక్కడే ఉన్నాడు. యోగేశ్ తండ్రి ట్రాక్టర్ నడపవలసి వచ్చినప్పుడల్లా కడుపులో నొప్పి వస్తున్నట్లు పేర్కొన్నాడు. తండ్రి పడుతున్న భాదలు గమనించి డ్రైవర్ లెస్ ట్రాక్టర్ తయారు చేయాలనీ నిర్ణయించుకున్నాడు. 

కేవలం రెండు వేల రూపాయలతో ప్రయోగం మొదలుపెట్టాడు. ఇది ఎలా పనిచేస్తుందో తండ్రికి చెప్పినప్పుడు ట్రాక్టర్ ఎవరు సహాయం లేకుండా టెస్ట్ చేసి తండ్రి చుపించామన్నాడు. యోగేశ్ రెండు వేల రూపాయలతో కొన్ని పరికరాలను కొనుగోలు చేసి రిమోట్ సాయంతో ట్రాక్టర్ ను వెనుకకు ముందుకు నడిపించాడు. తండ్రికి కొడుకు ఆలోచనలపై నమ్మకం కలిగి అప్పుడు యోగేష్ కు రూ.50 వేలు అప్పు చేసి డబ్బు ఇచ్చాడు. పట్టుదలతో యోగేశ్ డ్రైవర్ లేకుండా ట్రాక్టర్ తయారు చేశాడు. ఈ ట్రాక్టర్ తో రైతుకు ఎన్నో లాభాలు అంటున్నాడు యోగేష్. ఆరోగ్య సమస్యలు లేకుండా చేస్తుందని, డబ్బు, సమయం ఆదా అవుతుందని తెలిపాడు. యోగేష్ రూపొందించిన రిమోట్ కంట్రోలర్ ట్రాక్టార్ ను చూసిన స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి:

ఈ ఎలక్ట్రిక్ కారు మైలేజ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు

లోన్ తీసుకునేవారికి ఎస్‌బీఐ తీపికబురు

మరిన్ని వార్తలు