ఫలితాల తర్వాత ఆమె ‘జై శ్రీరామ్‌’ అనక తప్పదు

8 Apr, 2021 16:54 IST|Sakshi

కలకత్తా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మూడు విడతల పోలింగ్‌ ముగియగా ఐదు దశ పోలింగ్‌ ఉండడంతో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వాతావరణం ఇంకా హాట్‌హాట్‌గా ఉంది. అన్ని రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు బెంగాల్‌పైనే ప్రధాన దృష్టి సారించాయి. ఈ క్రమంలో తాజాగా గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకుడు, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నాడు. మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశాడు. మే 2వ తర్వాత మమతా బెనర్జీ ‘జై శ్రీరామ్‌’ అనక తప్పదని స్పష్టం చేశాడు. ఆ విధంగా అనిపిస్తామని పేర్కొన్నాడు.

ఎన్నికల్లో భాగంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘హిందూత్వ రాజకీయం’ అంటూ బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలపై స్పందన యోగి ఆదిత్యనాథ్‌ పై వ్యాఖ్యలు చేశారు. హుగ్లీ జిల్లా కృష్ణరామ్‌పూర్‌లో నిర్వహించిన ప్రచార సభలోభాయన మాట్లాడుతూ.. తృణమూల్‌ కాంగ్రెస్‌ రోమియోలను కటకటాల పాలవుతారని తెలిపారు. సీఏఏ ఉద్యమానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతు పలికిందని గుర్తుచేశారు. ప్రస్తుతం వారి ఓటు బ్యాంక్‌ కోసం వెంపర్లాడుతోందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్‌ 9వ తేదీకి ఆఖరి దశ పోలింగ్‌ ఉంది. మే 2వ తేదీన ఫలితాలు వెలువడుతాయి.

మరిన్ని వార్తలు