మోదీ@20 పుస్తకావిష్కరణ... ఒక ప్రధాని ఉండేవారంటూ కాంగ్రెస్‌ పై విరుచుకుపడ్డ యూపీ సీఎం

10 Sep, 2022 17:51 IST|Sakshi

వారణాసి: యూపీలోని వారణాసిలో రుద్రాక్ష్‌ కన్వెక్షన్‌ సెంటర్‌లో మోదీ@20 అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ... ఒకప్పుడూ ఒక ప్రధాని ఉండేవారంటూ మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ పేరు చెప్పకుండానే ఆయనతో మోదీని పోల్చారు.

ఆయనకు భిన్నంగా ప్రస్తుత ప్రధాని వారసత్వం భారతదేశానికి గర్వకారణమని అన్నారు. అలాగే భారత్‌ని ఏక్‌ భారత్‌, శ్రేష్ట భారత్‌గా మార్చాలనే సంకల్పంతో ఉన్న మోదీ భారత్‌కి లభించారంటూ ప్రశంసించారు. అంతేకాదు భారత్‌ ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రపంచానికి తెలియజేసేలా ఆదర్శంగా నిలించిందన్నారు.

కాశ్మీర్‌లో ఉగ్రవాద మూలాలను శాశ్వతంగా అంతం చేయడంలో ప్రధాని వెనుకాడడం లేదని కొనియాడారు. ఇదే మోదీ నాయకత్వ సామర్థ్యం అని పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు సోమ్‌నాథ్‌ పునరుద్ధరణ కోసం రాష్ట్రపతిని పంపని ఒక ప్రధానిని చూశాం, అలాగే భవ్య శ్రీరామ నిర్మాణ పనులు స్వయంగా పర్యవేక్షిస్తున్న ప్రధానిని కూడా చూశాం అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు.

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకులలో మన ప్రధాని ఒకరు కావడం మనకు గర్వకారణమని అన్నారు. అంతేకాదు ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించిందని, దాదాపు వందల ఏళ్ల పాటు దేశాన్ని ఏలిన బ్రిటన్‌ని వెనక్కినెట్టి మరీ ఈ స్థానానికి చేరుకుందని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ అన్నారు.

(చదవండి: గోవాలో బ్రిటన్‌ హోం సెక్రటరీ తండ్రికి ఉన్న ఆస్తి కబ్జా... విచారణకు ఆదేశం)

మరిన్ని వార్తలు