Baby Name: ఈ పేర్లు పిల్లలకు పెడితే జైలుకే?

6 Feb, 2024 08:12 IST|Sakshi

ఏ ఇంటిలోనైనా పిల్ల లేదా పిల్లవాడు పుడితే... ఏం పేరు పెట్టాలా?.. అని కుటుంబ సభ్యులంతా మల్లగుల్లాలు పడుతుంటారు. ఎవరికితోచిన పేరు వారు సూచిస్తుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, ఇంటి చుట్టుపక్కలవారు అందరూ రకరకాల పేర్లను చెబుతుంటారు. అయితే ప్రపంచంలోని పలు దేశాల్లో పిల్లల పేర్లకు సంబంధించి అనేక ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? కొన్ని పేర్లను నిషేధించిన దేశాల జాబితాను ఇప్పుడు చూద్దాం. కుటుంబ సభ్యులు తమ పిల్లలకు ఆయా దేశాల్లో నిషేధించిన పేరు పెట్టినట్లయితే, వారు జైలు శిక్షను కూడా అనుభవించాల్సిరావచ్చు.

‘డైలీ స్టార్’తెలిపిన వివరాల ప్రకారం బ్రిటన్‌లో పేరు పక్కన ఇంటిపేరు ఉంచుకోవడంపై నిషేధం లేదు. అయితే రిజిస్ట్రార్లు ఎలాంటి పేర్లను అంగీకరిస్తానేది తప్పకుండా గమనించాలి. పేరులో అభ్యంతరకర అక్షరాలు ఉండకూడదు. సంఖ్యలు లేదా చిహ్నాలు మొదలైనవి ఉపయోగించేటప్పుడు వాటిని సరిగా వినియోగిస్తున్నట్లు స్పష్టం చేయాలి. పేరు చాలా పొడవుగా  ఉండకూడదు. అది రిజిస్ట్రేషన్ పేజీలో ఇచ్చిన కాలమ్‌లో సరిపోయినంతవరకే ఉండాలి. పేరు చాలా పెద్దగా ఉంటే రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాదు.

అమెరికన్ జనన ధృవీకరణ పత్రంలోని వివరాల ప్రకారం పిల్లలకు కింగ్, క్వీన్, జీసస్ క్రైస్ట్, III, శాంతా క్లాజ్, మెజెస్టీ, అడాల్ఫ్ హిట్లర్, మెస్సీయా, @, 1069 లాంటి పేర్లు పెట్టకూడదు. కొన్ని దేశాల్లో పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి.

ఏ దేశంలో ఏ పేరుపై నిషేధం?

సెక్స్ ఫ్రూట్ (న్యూజిలాండ్)
లిండా (సౌదీ అరేబియా)
స్నేక్‌ (మలేషియా)
ఫ్రైడే (ఇటలీ)
ఇస్లాం (చైనా)
సారా (మొరాకో)
చీఫ్ మాక్సిమస్ (న్యూజిలాండ్)
రోబోకాప్ (మెక్సికో)
డెవిల్ (జపాన్)
నీలం (ఇటలీ)
సున్తీ (మెక్సికో)
ఖురాన్ (చైనా)
హ్యారియెట్ (ఐస్లాండ్)
మంకీ (డెన్మార్క్)
థోర్ (పోర్చుగల్)
007 (మలేషియా)
గ్రిజ్‌మన్ ఎంబాప్పే (ఫ్రాన్స్)
తాలులా హవాయి (న్యూజిలాండ్)
బ్రిడ్జ్‌(నార్వే)
ఒసామా బిన్ లాడెన్ (జర్మనీ)
మెటాలికా (స్వీడన్)
ప్రిన్స్ విలియం (ఫ్రాన్స్)
అనల్ (న్యూజిలాండ్)
నుటెల్లా (ఫ్రాన్స్)
వోల్ఫ్ (స్పెయిన్)
టామ్-టామ్ (పోర్చుగల్)
కెమిల్లా (ఐస్లాండ్)
జుడాస్ (స్విట్జర్లాండ్)
డ్యూక్ (ఆస్ట్రేలియా)

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega